మెకప్ మ్యాన్ వల్లే అది పూర్తిగా నేర్చుకున్న తమన్నా.. లేకపోతే ఇప్పటికి అలానే?

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి అందరికీ పరిచయమే.తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

 Tamanna Learned It Completely Because Of The Make Up Man Otherwise Still The Same-TeluguStop.com

తన అందంతో మాత్రం కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది.తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో తన ఖాతా నింపుకుంటుంది.ఇదిలా ఉంటే మేకప్ మాన్ వల్ల ఇప్పుడిలా ఉన్నాను అంటూ కొన్ని విషయాలు పంచుకుంది.

 Tamanna Learned It Completely Because Of The Make Up Man Otherwise Still The Same-మెకప్ మ్యాన్ వల్లే అది పూర్తిగా నేర్చుకున్న తమన్నా.. లేకపోతే ఇప్పటికి అలానే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు సినీ ఇండస్ట్రీకి 2005లో శ్రీ అనే సినిమాతో పరిచయమైంది.ఇక ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీ డేస్ అనే సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమాతోనే తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకుపోయింది.కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించింది.

ఇదిలా ఉంటే తమన్నాకు కెరీర్ మొదట్లో తెలుగు భాషలో బాగా ఇబ్బందులు ఎదురయ్యాయి.

తనకు తెలుగు మాట్లాడడం రాకపోయేసరికి సెట్ లో బాగా ఫీల్ అయ్యిందని తెలిసింది.గతంలో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది.తాను శ్రీ సినిమాలో నటిస్తున్న సమయంలో తనకు తెలుగు అర్థం అయ్యేది కాదని తెలిపింది.అంతేకాకుండా అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకునే వారని తెలిపింది.

Telugu F3 Movie, Film Industry, Heroine, Learned, Mack Up Man, Maestro, Seetimarr Movie, Tamanna Makeup Man Chakravarthi, Tamannah, Telugu Language, Tollwood-Movie

కానీ తనకు తెలుగు భాష రాకపోవడంతో ఓ మూల కూర్చొని బాధపడేదట.దీంతో తన మేకప్ మాన్ చక్రవర్తి సహాయంతో తనకు మెల్లి మెల్లిగా తెలుగు నేర్చుకోవడం, మాట్లాడటం తెలిసిందట.దాంతో అప్పటి నుంచి తను కూడా తెలుగు సినీ సమయంలో అక్కడున్న వాళ్లతో తెలుగులో మాట్లాడటానికి బాగా ప్రయత్నించిందట.ఆ రోజు అలా నేర్చుకోవడం వల్లే ఇప్పుడు తెలుగులో బాగా మాట్లాడగలను అని తెలిపింది.

Telugu F3 Movie, Film Industry, Heroine, Learned, Mack Up Man, Maestro, Seetimarr Movie, Tamanna Makeup Man Chakravarthi, Tamannah, Telugu Language, Tollwood-Movie

ఇక తాను ఏ భాషలో నటించిన కూడా ఆ భాష నేర్చుకోవటమే తన సిద్ధాంతమని తన పాత్రకు తన గొంతు వాడితేనే తనకు తృప్తి ఉంటుందని తెలిపింది.అలా ఇప్పుడు ఏదైనా కార్యక్రమంలో, సినీ ఈవెంట్ వేడుకల్లో పాల్గొన్న కూడా తాను తెలుగులో బాగా మాట్లాడుతుంది.ఇక ప్రస్తుతం తమన్నా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Telugu F3 Movie, Film Industry, Heroine, Learned, Mack Up Man, Maestro, Seetimarr Movie, Tamanna Makeup Man Chakravarthi, Tamannah, Telugu Language, Tollwood-Movie

ఇటీవలే గోపీచంద్ సరసన సిటీ మార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలాగే నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి ఫిదా చేసింది.వీటితో పాటు మరిన్ని సినిమాలలో బిజీగా ఉంది.

అందులో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్3 సినిమాలో నటిస్తుంది.

అంతేకాకుండా గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో కూడా బిజీగా ఉంది.

ఇక బాలీవుడ్ లో అంధాదున్, బోలె చుడియన్ సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.నార్తన్ దర్శకత్వంలో మరో సినిమాకు సిద్ధంగా ఉంది.

ఇక వెబ్ సిరీస్ లో కూడా బిజీగా ఉంది.బుల్లితెర రియాలిటీ షో వంటల ప్రోగ్రామ్ కు కూడా హోస్టింగ్ చేస్తుంది.

#Seetimarr #Tollwood #Mack #Maestro #Tamannah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube