అసలేం జరిగింది : అల్లు అర్జున్‌ ఐటెంను చూసి మహేష్‌ భయపడ్డాడా?

మహేష్‌ బాబు 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు విడుదలకు సిద్దం అవుతుంది.సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రంను వచ్చే నెలతో పూర్తి చేయాలని భావిస్తున్నారు.

 Tamanna Item Song Was Cancelled In Sarileru Nekevvaru-TeluguStop.com

వచ్చే నెలలో తమన్నాతో అదిరిపోయే ఐటెం సాంగ్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.మహేష్‌బాబు సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు రాని.

చేయని ఐటెం సాంగ్‌ను ఈ చిత్రంలో చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

 Tamanna Item Song Was Cancelled In Sarileru Nekevvaru-అసలేం జరిగింది : అల్లు అర్జున్‌ ఐటెంను చూసి మహేష్‌ భయపడ్డాడా-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమన్నాకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఐటెం సాంగ్‌ను చేయడం లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పారు.

  తమన్నా ఐటెం సాంగ్‌తో మాస్‌ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే అవకాశం ఉన్నా ఎందుకు మహేష్‌ బాబు వద్దనుకుంటున్నాడు అంటే సోషల్‌ మీడియాలో విభిన్నమైన కామెంట్స్‌ వస్తున్నాయి.సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న ప్రచారం మేరకు సరిలేరు నీకెవ్వరు చిత్రంకు పోటీగా అల వైకుంఠపురంలో చిత్రం రాబోతుంది.థమన్‌ సంగీతం అందిస్తున్న ఆ సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

బన్నీ మరియు పూజా హెగ్డేల సాంగ్స్‌ ముందు సరిలేరు నీకెవ్వరులో ఎంత మంచి సాంగ్‌ చేసినా కూడా తేలిపోతుంది.పెద్దగా ప్రేక్షకులకు నచ్చదు.

  బన్నీ మరియు పూజా ఇద్దరు కూడా గొప్ప డాన్సర్స్‌.అలాంటి వారి పాటతో పోటీ పడటం అంటే మన పరువు మనం తీసుకున్నట్లే అంటూ సరిలేరు నీకెవ్వరు టీం భావించిందట.అందుకే తమన్నా ఐటెం సాంగ్‌ తొలగించి ఎంట్‌ టైన్‌మెంట్‌ విషయంలోనే రాజీలేకుండా తీయాలని అనీల్‌ రావిపూడి భావిస్తున్నాడట.అయితే ఈ వాదనను మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కొట్టి పారేస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ మాస్‌ ఐటెం సాంగ్‌ ముందు థమన్‌ పాట నిలుస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.సినిమాలో ఐటెం సాంగ్‌ అవసరం లేదు కనుక వారు వద్దనుకున్నారని, అంతే తప్ప దీంట్లో పెద్ద చర్చలు, మరేంటో ఏమీ లేవని చెబుతున్నారు.

#AnilRavipudi #AlluArjun #Trivikram #TamannaItem #ThamanMusic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు