ఎన్టీఆర్‌ మూవీలో ఐటెంగా స్టార్‌ హీరోయిన్‌

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న విషయం తెల్సిందే.రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు.

 Tamanna Item Song In Jr Ntr – Sukumar Film-TeluguStop.com

వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఒక స్టార్‌ హీరోయిన్‌ ఐటెం సాంగ్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఆ ఐటెం సాంగ్‌ను సినిమాకే ప్రధాన ఆకర్షణగా సుకుమార్‌ తెరకెక్కించాలనే ప్లాన్‌ చేస్తున్నాడు.

ఆ ఐటెం సాంగ్‌లో నటించబోతున్న హాట్‌ స్టార్‌ హీరోయిన్‌ తమన్నా.గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కిన ‘అల్లుడు శీను’ చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్‌ చేసిన విషయం తెల్సిందే.

ఇటీవలే ఈమె ‘బాహుబలి’ సినిమాలో అవంతికగా కనిపించి మెప్పించింది.ఇక ప్రస్తుతం రవితేజ ‘బెంగాల్‌ టైగర్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.ఎన్టీఆర్‌తో ‘ఊసరవెల్లి’ సినిమాలో నటించి మెప్పించిన తమన్నా తాజాగా ఆయన కోసం మరోసారి ఐటెం అవతారం ఎత్తేందుకు సిద్దం అయ్యింది.‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు తమన్నా ఐటెం సాంగ్‌ ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube