తమన్నా అందుకు ఒప్పుకుంటుందా..?

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికి కూడా సూపర్ ఫాంలో ఉంది.ఓ పక్క స్టార్ హీరోల సరసన నటిస్తూనే యువ హీరోలకు ఆమె ఓకే చెబుతుంది.

 Tamanna To Act Opposite To Balakrishna, Tamanna, Balakrishna, Gopichand Malineni-TeluguStop.com

ప్రస్తుతం వెంకటేష్ తో F3లో నటిస్తున్న తమన్నా సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం సినిమాలో కూడా నటిస్తుంది.ఈ రెండు సినిమాలతో పాటుగా గోపీచంద్ సీటీమార్ సినిమా చేసింది.

ఇక మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నట్టు టాక్.సినిమాలతోనే కాదు వెబ్ సీరీస్ లతో కూడా సత్తా చాటుతుంది తమన్నా.

ఈమధ్యనే ఆహాలో లెవంత్ అవర్, నవంబర్ డైరీస్ వెబ్ సీరీస్ లతో అలరించింది.

ఇక లేటెస్ట్ గా మరో సీనియర్ హీరో ఛాన్స్అం దుకుందట తమన్నా.

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

తమన్నా అయితే ఇటు గ్లామర్ సైడ్ కూడా వర్క్ అవుట్ అవుతుందని చిత్రయూనిట్ ప్లాన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బాలయ్య కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

బాలయ్యతో తమన్నా నటించేందుకు ఒప్పుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube