'ఎఫ్‌ 2'తో మెగా ఛాన్స్‌ దక్కించుకున్న తమన్నా

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్‌ 2’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.రికార్డు స్థాయి వసూళ్లతో ఈ చిత్రం దూసుకు పోతుంది.

 Tamanna In Koratala And Megastar Movie In Her Next-TeluguStop.com

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కలెక్షన్స్‌ జోరు చూస్తుంటే మామూలుగా లేదు.వంద కోట్లు క్రాస్‌ చేసినా కూడా భారీగానే వసూళ్లు సాధిస్తూనే ఉన్నాయి.

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లు కలిసి నటించిన ఈ మల్టీస్టారర్‌ చిత్రానికి అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా తమన్నా నిలిచింది.సీనియర్‌ హీరో వెంకటేష్‌ తో తమన్నా ఎలా ఉంటుందో అని అంతా భావించారు.కాని వెంకీకి సరి జోడీగా తమన్నా నిలిచింది.

‘ఎఫ్‌ 2’ చిత్రం సక్సెస్‌తో ఈమె కెరీర్‌ మళ్లీ టర్న్‌ అయినట్లుగా చెప్పుకుంటున్నారు.ఎఫ్‌ 2 చిత్రంకు ముందు తమన్నా పెద్దగా సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకోలేక పోయింది.

కాని ఎప్పుడైతే ఎఫ్‌ 2 చిత్రం విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అప్పుడే మళ్లీ తమన్నా టైం స్టార్ట్‌ అయ్యింది.

సీనియర్‌ హీరోలు ఈమెతో వర్క్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

వెంకీకి బాగా సెట్‌ అయిన ఈ అమ్మడు చిరుకు కూడా సూట్‌ అవుతుందనే నమ్మకంకు కొరటాల శివ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఒక చిత్రంకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది.

సైరా చిత్రం షూటింగ్‌ ముగిసిన వెంటనే కొరటాల చిత్రంలో చిరంజీవి పాల్గొనబోతున్నాడు.ప్రస్తుతం సినిమా కోసం హీరోయిన్‌ ఎంపిక జరుగుతోంది.

హీరోయిన్‌ ఎవరైతే బాగుంటుందని చర్చలు జరుపుతున్న సమయంలో ఎఫ్‌ 2 ముద్దుగుమ్మ తమన్నాకు ఆ అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

తాజాగా తమన్నాతో కొరటాల చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.చిరంజీవితో సినిమా అంటే ఏ హీరోయిన్‌ మాత్రం నో చెబుతుంది చెప్పండి.ప్రస్తుతం సైరా చిత్రంలో ఒక పాత్రను చేస్తున్న ముద్దుగుమ్మ తమన్నా ఆ తర్వాత సినిమాలో చిరంజీవి పూర్తి స్థాయిలో రొమాన్స్‌ చేయబోతుందన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube