అలాంటి ఫోటో షేర్ చేసిన తమన్నా.. అవాక్కైన ఫ్యాన్స్..?

హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నాకు సంవత్సరాలు గడుస్తున్నా అవకాశాలు తగ్గడం లేదు సరికదా అంతకంతకూ అవకాశాలు పెరుగుతున్నాయి.సీనియర్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తమన్నాకు కుర్ర హీరోల సరసన ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయి.

 Tamanna Hot Photo Goes Viral In Social Media,thammanna.andudan Remak,f3 Movie,vi-TeluguStop.com

వయస్సు పెరుగుతున్నా యంగ్ గా కనిపిస్తున్న తమన్నా ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ గా మారిపోయారు.లుక్ పై ఎక్కువగా దృష్టి పెట్టిన తమన్నా జిమ్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

తమన్నా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో జిమ్ లో వ్యాయామాలు చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రెడ్ కలర్ టాప్, బ్లాక్ కలర్ ప్యాంట్ లో చెమటలు చిందిస్తూ గ్లామరస్ గా తమన్నా కనిపిస్తున్నారు.

తమన్నా షేర్ చేసిన ఈ ఫోటోపై నెటిజన్లు ఫిట్ నెస్ ఐకాన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ ఫోటోకు 8 లక్షల కంటే ఎక్కువగా లైకులు వచ్చాయి.

ఆ ఫోటోకు మన మనస్సు ఏం సాధించాలని అనుకుంటుందో మన శరీరం తెలుపుతుందని ఆమె పేర్కొన్నారు.

Telugu Red Color Top, Tamanna Hot-Movie

మరోవైపు తమన్నా ప్రస్తుతం సీటీమార్, అందాధున్‌ సినిమా రీమేక్ లో నటిస్తున్నారు.ఈ సినిమాలతో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 3లో కూడా తమన్నా నటిస్తున్నారు.క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్న తమన్నా ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్టైతే యంగ్ స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు దక్కే ఛాన్స్ ఉంది.

సీనియర్ స్టార్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతుంటే తమన్నా మాత్రం వారికి భిన్నంగా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం.గోపీచంద్, నితిన్, వెంకటేష్ లతో నటిస్తున్న తమన్నా కొత్త సినిమా కథలను కూడా వింటున్నట్టు తెలుస్తోంది.

కొన్ని నెలల క్రితం కరోనా బారిన పడ్డ తమన్నా వైరస్ నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube