మహేష్ సినిమాలో మిల్కీ ఐటెం సాంగ్.. బొమ్మ అదిరింది!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తుండగా ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 Tamanna First Look From Sarileru Neekevvaru Item Song-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

గతంలో మహేష్ బాబు సరసన ఆగడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన తమన్నా ఇప్పుడు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో చిందులేసింది.ఈ పాటకు సంబంధించిన తమన్నా పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో తమన్నా అదిరిపోయే స్టెప్పు వేస్తూ కనిపించింది.

Telugu Anil Ravipudi, Item, Mahesh Babu, Tamanna-

ఇక తమన్నా-మహేష్ కలిసి చిందులేసే పాట ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు.భారీ తారాగణం ఉన్న సరిలేరు నీకెవ్వరు సినిమాను అనిల్ రావూడి డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube