ఆ హీరోల సరసన నటించాలంటే ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పారితోషికం విషయంలో బాగా డిమాండ్ చేస్తుంటారు.ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్స్ మాత్రం పారితోషికం విషయంలో అస్సలు తగ్గరు.

 Tamanna, Tollywood, Remuneration, Big Hero Films,latest Tollywood News-TeluguStop.com

కథ నచ్చినప్పటికి కూడా పారితోషకం తక్కువగా ఉంటే సినిమాను వదులుకున్న నటీనటులు కూడా ఉన్నారు.ఇక కొందరు హీరోయిన్స్ స్టార్ హీరోలతో నటించడానికి కూడా పారితోషికం విషయంలో డిమాండ్ చేస్తుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోల సరసన నటించడానికి ఓ స్టార్ హీరోయిన్ ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుంది.ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు.

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ప్రస్తుతం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.హీరోయిన్ గానే కాకుండా వ్యాఖ్యాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.రెమ్యూనరేషన్ విషయంలో కూడా కోటిన్నరకు మించదని టాలీవుడ్ లో టాక్.

Telugu Big, Tamanna, Tollywood-Movie

ఇక తాజాగా కోటిన్నరకు పైగా రెమ్యూనరేషన్ పెంచుకోవడానికి సిద్ధంగా ఉంది.ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సీనియర్ హీరోలతో నటించడానికి ముందుకు వచ్చింది.ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం కష్టమవుతుంది.దీంతో ఈ ఆసరాతో తన రెమ్యునరేషన్ ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది.ఇక నిర్మాతలు కూడా స్టార్ హీరోల సరసన హీరోయిన్స్ దొరకడం కష్టమవ్వడంతో తప్పదు అనుకుని తమన్నా అడిగిన రెమ్యూనరేషన్ కు సిద్ధమైనట్లు తెలుస్తుంది.ప్రస్తుతం తమన్నా ఎఫ్ 3, భోళా శంకర్ సినిమాలలో నటిస్తుంది.

వీటితో పాటు మరిన్ని అవకాశాలు అందుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube