తమన్నా డిజిటల్ ఎంట్రీ నవంబర్ స్టోరీతో ఏదో చెప్పబోతోంది  

Tamanna Debut Web Series teaser, Kollywood, Digital Entertainment, Web Series, November Story, OTT Platform - Telugu Digital Entertainment, Kollywood, November Story, Ott Platform, Tamanna, Web Series

సౌత్ ఇండియా అందాల భామలు ఒకరి తర్వాత ఒకరు డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు.కమర్షియల్ ఫార్ములాలో నడిచే సినిమాల నుంచి కాస్తా ఫ్రీ అయ్యి వెబ్ సిరీస్ ల ద్వారా తమలోని నటిని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

TeluguStop.com - Tamanna Debut Web Series Teaser

ఇప్పటికే ప్రియమణి, సమంత, కాజల్ అగర్వాల్ డిజిటల్ వెబ్ సిరీస్ ఎంట్రీ కన్ఫర్మ్ కావడం వారు నటించిన వెబ్ సిరీస్ లు ప్రీమియర్ కి రెడీ కావడం జరుగుతున్నాయి.ఇదిలా ఉంటే ఈ దారిలోకి మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరుతుంది.

ఈ లీడ్ రోల్ లో తమిళం లో రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో నవంబర్ స్టోరీ టైటిల్ తో వెబ్ సిరీస్ తెరకెక్కింది.తండ్రి, కూతుళ్ళ కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన టీజర్ ని దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

TeluguStop.com - తమన్నా డిజిటల్ ఎంట్రీ నవంబర్ స్టోరీతో ఏదో చెప్పబోతోంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

టీజర్ చూస్తుంటే క్రైమ్ థ్రిల్లర్ తరహాలో ఉంది.గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురవ్వడం, ఈ హత్యకు దేశంలో ప్రసిద్ధ క్రైమ్ నవలా రచయిత అయిన తమన్నా తండ్రికి సంబంధం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడం కనిపిస్తుంది.

అలాగే తన తండ్రికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని రుజువు చేసి అతనిని కాపాడుకోవడానికి కూతురు చేసే ప్రయత్నం అంతా థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆవిష్కరించారు.ఈ సిరీస్ లో తమన్నా తండ్రి పాత్రలో జిఎమ్.

కుమార్ కనిపిస్తున్నాడు.మొత్తానికి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా నటిగా తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి కావాల్సిన కథని ఎంచుకుందని ఈ టీజర్ చూస్తూ ఉంటే అర్ధమవుతుంది.

నవంబర్ స్టోరీ సిరీస్ త్వరలోనే డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.దీనిని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

#Web Series #OTT Platform #November Story #Kollywood #Tamanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamanna Debut Web Series Teaser Related Telugu News,Photos/Pics,Images..