తమన్నా హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే!

సాధారణంగా సినీ సెలబ్రిటీలు వారు ఉపయోగించే వస్తువులను వారి రేంజ్ కి అనుగుణంగా ఎంతో ఖరీదైనవి,బ్రాండెడ్ వస్తువులను వాడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు లక్షల్లో వేళల్లో ఖరీదు చేసే వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు.

 Tamanna Bhatia Chloe Hand Bag Price Details, Tamannaah,f3,tollywood,mumbai,koll-TeluguStop.com

అయితే కొన్నిసార్లు కొన్న వస్తువులు ధరలు చూస్తే మాత్రం సాధారణ ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురవుతారు.ఈ క్రమంలోనే మిల్క్ బ్యూటీ తమన్న సైతం వేల రూపాయల విలువ చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుగోలు చేశారని తెలియడంతో అందరూ ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా పేరు సంపాదించుకున్న తమన్నా ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఈమె ఎఫ్ 3 సినిమా ద్వారా మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈమె పలు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు .తాజాగా ముంబైలోని ఒక ఫేమస్ పార్లర్ నుంచి బయటకు వస్తూ ఈమె కెమెరా కంటికి చిక్కారు.

ఫంకీ ప్రింటెడ్ స్వెట్‏షర్ట్‏ను ధరించి బ్లాక్ జాగర్స్‏తో మరింత కూల్ లుక్‍లో కనిపించి తమన్నా సందడి చేసినప్పటికీ అందరి దృష్టి మాత్రం ఈమెపై కాకుండా ఈమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ పై పడింది.ఈ క్రమంలోనే ఈ హ్యాండ్ బ్యాగ్ ధర ఎంత ఉంటుంది అంటూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.తమన్నా ఉపయోగిస్తున్నటువంటి ఈ హ్యాండ్ బ్యాగ్ క్లో టోట్ బ్యాగ్ కాగా దీని ధర అక్షరాల రూ.87,783 కావడంతో అందరూ ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.ప్రస్తుతం ఈమె హ్యాండ్ బ్యాగ్ తెర తెలుసుకున్న నెటిజన్లు మిల్క్ బ్యూటీ రేంజ్ కి ఆ మాత్రం ఉండాల్సిందేలే అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube