ఫొటోటాక్‌ : వారికి తమన్నా హృదయపూర్వక కృతజ్ఞతలు  

Tamanna bhatia about covid 19 treatment hospital , Heroine Tamanna, Corona Negative, Covid treatment, tamanna shares photo, tamanna shooting - Telugu Corona, Corona Negative, Heroine Tamanna, Telugu Heroine

మిల్కీబ్యూటీ తమన్నా కరోనాను జయించింది.హైదరాబాద్‌ లో ఆమె ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో స్వల్పంగా అస్వస్థతకు గురి అయ్యింది.

TeluguStop.com - Tamanna Bhatia About Covid 19 Treatment Hospital

దాంతో ఆమె వెంటనే కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అంటూ వచ్చింది.కాస్త అస్వస్థత ఉన్న కారణంగా హైదరాబాద్‌ కాంటినెంటల్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యింది.

ఆ ఆసుపత్రిలో తమన్నా దాదాపుగా రెండు వారాల పాటు ఉంది.రెండు వారాల్లో ఆమె పూర్తిగా కోలుకుని బయటకు వచ్చేసింది.

TeluguStop.com - ఫొటోటాక్‌ : వారికి తమన్నా హృదయపూర్వక కృతజ్ఞతలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కరోనా నెగటివ్‌ వచ్చిన తర్వాత కూడా రెండు మూడు రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉంది.ఆమెకు అక్కడి వైధ్యులు అత్యాధునిక వసతులతో చికిత్స అందించడంతో పాటు చాలా అప్యాయంగా ఆమెను ట్రీట్‌ చేశారట.

తన కరోనా టైంను గుర్తు చేసుకుంటూ తమన్నా ఈ ఫొటోను షేర్‌ చేసింది.

తమన్నాకు ట్రీట్‌మెంట్‌ అందించిన కాంటినెంటల్‌ ఆసుపత్రి డాక్టర్లు మరియు యాజమాన్యంను ఈ ఫొటోలో చూడవచ్చు.

ఈ ఫొటోను షేర్‌ చేసిన తమన్నా వీరి గురించి చెప్పేందుకు పదాలు సరిపోవడం లేదు.డాక్టర్లు, నర్స్‌ లు మరియు స్టాఫ్‌ ఇలా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంతో బాగా చూసుకున్నారు.

నేను బలహీనంగా ఉన్న సమయంలో నాకు అనారోగ్యంగా ఉన్న సమయంలో వారు నా పట్ల చూపించిన కేరింగ్‌ కు ముగ్దురాలిని అయ్యాను.వారి దయ మరియు కేరింగ్‌ వల్లే నేను ఇంత స్పీడ్‌ గా కరోనాను జయించాను.

ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ తమన్నా పేర్కొంది.

కరోనా నెగటివ్‌ రావడంతో తమన్నా ముంబయి చేరుకుంది.

ఆమె ప్రస్తుతం కుటంబ సభ్యులతో సరదాగా ఆడుతూ పాడుతూ టైం ను ఎంజాయ్‌ చేస్తుంది.ఒకటి రెండు వారాల తర్వాత ఆమె షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతుందట.

ఈమె టాలీవుడ్‌ లో రెండు సినిమాలు చేయడంతో పాటు వెబ్‌ సిరీస్‌ మరియు టాక్‌ షో కూడా చేస్తోంది.

#Corona #Heroine Tamanna #Corona Negative

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamanna Bhatia About Covid 19 Treatment Hospital Related Telugu News,Photos/Pics,Images..