తమన్నా మరో ఐదేళ్లు గ్యారెంటీ..!

మిల్కీ బ్యూటీ తమన్నా వెండితెరకు పరిచయమై 15 ఏళ్లు పైన అవుతున్నా ఇప్పటికి అమ్మడికి మంచి క్రేజ్ ఉంది.సీనియర్ స్టార్ హీరోలతో పాటుగా యువ హీరోలతో కూడా తమన్నా జోడీ కడుతుంది.

 Tamanna Another 5 Years Career Confirmed Tollywood , Maestro , Master Chef, Milk-TeluguStop.com

ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్3లో నటిస్తున్న తమన్నా, నితిన్ తో మాస్ట్రో, సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తుంది.ముఖ్యంగా నితిన్ మాస్ట్రో సినిమాలో తమన్నా నటన అదిరిపోతుందని అంటున్నారు.

లేటెస్ట్ గా రిలీజైన మాస్ట్రో ట్రైలర్ చూస్తే తమన్నా తన పాత్రకు పర్ఫెక్ట్ గా చేసిందని చెబుతున్నారు.అంతేకాదు ఇలానే చేస్తే తమన్నా మరో ఐదేళ్లు కూడా కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందని అంటున్నారు.

కేవలం సినిమాలే కాదు ఈమధ్య డిజిటల్ తెరపై వెబ్ సీరీస్ లతో కూడా అదరగొడుతుంది తమన్నా.ఇవే కాకుండా లేటెస్ట్ గా ఒక రియాలిటీ షో హోస్ట్ గా కూడా చేస్తుంది అమ్మడు.

మాస్టర్ చెఫ్ షోకి తెలుగులో తమన్నా హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.ఇవన్ని చూస్తుంటే స్టార్ హీరోయిన్స్ కూడా చేయలేనివన్ని తమన్నా చేస్తుందని అంటున్నారు.తమన్నా కచ్చితంగా మరో ఐదారేళ్లు కెరియర్ కొనసాగించేలా ఉందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube