అహా అనిపించేందుకు వచ్చేస్తున్న తమ్మన్నా.. ముహూర్తం ఖరారు

మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన 11త్‌ అవర్‌ వెబ్‌ సిరీస్ గురించి కొన్ని నెలల క్రితం ఆహా వారు అధికారికంగా ప్రకటించారు.షూటింగ్‌ పూర్తి అయ్యింది.

 Tamanna And Praveen Sattaru Web Series 11th Hour Release Date , 11th Hour, Aha O-TeluguStop.com

స్ట్రీమింగ్‌ కు రెడీ చేస్తున్నాం అంటూ ప్రకటించారు.అయితే షూటింగ్‌ పూర్తి అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఆహా లో స్ట్రీమింగ్‌ అవ్వక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఔట్‌ పుట్‌ పై అసంతృప్తితో మొత్తం క్యాన్సిల్‌ చేశారా అంటూ అనుమానం వ్యక్తం అవుతున్న సమయంలో ఎట్టకేలకు స్ట్రీమింగ్‌ కు తేదీని ఖరారు చేశారు.ఏప్రిల్‌ 9వ తారీకున ఆహాలో తమన్నా ప్రధాన పాత్రలో నటించిన 11త్‌ అవర్ వెబ్‌ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ వెబ్‌ సిరీస్ ఎన్ని భాగాలుగా ఉండబోతుంది, ఏ జోనర్‌ లో ఉంటుంది అనే విషయమై స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా చిన్న ప్రోమోను మేకర్స్‌ విడుదల చేశారు.

జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది.

అర్థ రాత్రి సమయంలో ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తున్నట్లుగా లాంగ్‌ షాట్‌ లో చూపించారు.దాంతో ఇది ఒక రాత్రిలో జరిగే స్టోరీ అయ్యి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ వెబ్‌ సిరీస్ లో తమన్నాను కొత్తగా చూపిస్తారని కూడా మేకర్స్‌ అంటున్నారు.ఆహాలో ఇటీవల కాలంలో వచ్చిన వస్తున్న ప్రాజెక్ట్‌ లు అన్ని కూడా సక్సెస్‌ అవుతున్నాయి.

కనుక ఖచ్చితంగా ఈ వెబ్‌ సిరీస్ కూడా సక్సెస్‌ ను దక్కించుకుంటుందనే నమ్మకంను ఆహా వారు వ్యక్తం చేస్తున్నారు.అల్లు అరవింద్‌ మెచ్చిన ఈ కథ ను పూర్తిగా లాక్‌ డౌన్‌ సమయంలోనే షూట్‌ చేశారు.

అత్యంత సున్నితమైన అంశాలను ఈ సినిమా లో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు.దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మరో సారి తన ప్రతిభను ఈ సినిమా లో చూపించబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube