మరో పాన్ ఇండియా సినిమాలో తమన్నా.. హీరో ఎవరంటే?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ గ్లామర్ బ్యూటీ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 Tamanna Again Act In Pan India Movie-TeluguStop.com

తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం వంటి భాషలలో కూడా నటించింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ సర్వీస్ లో కూడా ముందుంటుంది తమన్నా.

2005లో శ్రీ అనే సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన తమన్నా ఈ సినిమాతో అంత గుర్తింపు తెచ్చుకోలేదు.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాలో నటించగా మంచి సక్సెస్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.అంతేకాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.

 Tamanna Again Act In Pan India Movie-మరో పాన్ ఇండియా సినిమాలో తమన్నా.. హీరో ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన బాహుబలి లో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ప్రస్తుతం మరో పాన్ ఇండియా సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది.

రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం కే జి ఎఫ్ 2 సినిమాలో బిజీగా ఉన్నాడు.ఇక ఈ సినిమా తర్వాత కన్నడ డైరెక్టర్ నార్తన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు.

ఇక ఆ సినిమా భారీ యాక్షన్ థ్రిల్లర్ తో పాటు ఆర్మీ నేపథ్యంలో రూపొందనుందట.ఇక ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించనుందని తెలుస్తుంది.

Telugu F3, Pan India, Tamanna, Tollywood-Movie

ఇది వరకే కేజిఎఫ్ 1 సినిమాలో యష్ సరసన స్పెషల్ సాంగ్ లో మెప్పించిన తమన్నా ఈ సారి ఏకంగా హీరోయిన్ గా నటించనుందని సమాచారం.ఇక ప్రస్తుతం తమన్నాతో ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయట.త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారట.ఇది కాకుండా మరో రెండు సినిమాలలో బిజీగా ఉన్నా తమన్నా గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

#Pan India #Tamanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు