ఫ్లాప్ అయినా సంతృప్తిని మిగిల్చాయంటున్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఒక వైపు ఆఫర్లు వస్తున్నా కూడా కొత్తగా ఏమైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే రెండు వెబ్‌ సిరీస్ లను చేసింది.ఆ రెండు వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఆమెదే కీ రోల్‌.

 Heroine Tamanna About Her Ott Web Series , Tamanna, Telugu Ott, Ott, Aha Ott , N-TeluguStop.com

రెండు వెబ్‌ సిరీస్ లు కూడా కమర్షియల్‌ గా నిరాశ పర్చాయి.మొదటగా లెవంన్త్‌ అవర్ అనే వెబ్‌ సిరీస్ తో ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రికార్డు స్థాయి వ్యూస్ ను ఆ వెబ్‌ సిరీస్ దక్కించుకుంటుందని అంతా భావించారు.కాని అనూహ్యంగా ఆ వెబ్‌ సిరీస్ ను ఎక్కు మంది చూడలేదు.

ఆ తర్వాత హాట్‌ స్టార్‌ ద్వారా నవంబర్‌ స్టోరీ వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ వెబ్‌ సిరీస్ కూడా యావరేజ్ అనే టాక్ ను దక్కించుకుంది.

ఈ వెబ్‌ సిరీస్ లో పలు లోపాలు ఉన్నాయి అనేది కొందరి మాట.రెండు వెబ్‌ సిరీస్ ల విషయంలో తమన్నా తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుంటే కొందరు మాత్రం మిల్కీ బ్యూటీ ఆ వెబ్‌ సిరీస్ లతో ఇన్నాళ్ల కెరీర్ లోనే ది బెస్ట్‌ అనిపించుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మిల్కీ బ్యూటీ తమన్నా రెండు వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించింది.ముఖ్యంగా నవంబర్ స్టోరీస్ లో ఆమె కొత్త లుక్‌ చాలా బాగుంది.

సింపుల్‌ గా ఆమె కనిపించిన తీరు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని కళ్లకు కట్టినట్లుగా చూపించింది.అద్బుతమైన నటనతో ఆకట్టుకుంటూ మెప్పించింది.అందుకే ఆమె ఈ రెండు వెబ్‌ సిరీస్ ల విషయంలో చాలా సంతృప్తికరంగా ఉన్నట్లుగా పేర్కొంది.ముఖ్యంగా నవంబర్‌ స్టోరీస్ వెబ్‌ సిరీస్ లో ఆమె నటనకు ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు దక్కాయి.

వెబ్‌ సిరీస్ ల్లో నటనకు లిమిట్స్ ఉండవు.కనుక ఎంతో మంది పెద్ద హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఓటీటీల వెంట పడుతున్నారు.

ఈమె కూడా ఆ దిశగా అడుగులు వేసింది.కొందరు విమర్శిస్తూ ఉంటే కొందరు మాత్రం ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube