రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గని మిల్కీ బ్యూటీ…!  

Tamanna Demands Two Crores Remuneration ,Gurthunda Seethakalam Movie, Tamanna with Satyadev, Remuneration, Andhadhun Remake, Nithin - Telugu Andhadhun Remake, Gurthunda Seethakalam Movie, Nithin, Remuneration, Tamanna Demands Two Crores Remuneration, Tamanna With Satyadev, Thamanna Batiya, Tollywood

తమన్నా భాటియా… భారతదేశం ప్రజలకు పరిచయం అక్కర్లేని హీరోయిన్ ఈవిడ.అటు బాలీవుడ్ లోనూ, అలాగే సౌత్ ఇండియా చలన చిత్ర పరిశ్రమలోనూ టాప్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి ప్రజల ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్ తమన్నా.

TeluguStop.com - Tamanna 2crores Remuneration Gurthunda Seethakalam

తన నటన, డాన్స్ లతో పాటు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ మిల్కీ బ్యూటీ.తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయినా ఇప్పటికి వరుస ఆఫర్లు దక్కించుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తున్న సిటీ మార్ సినిమాలో నటిస్తున్న సంగతి విదితమే.

TeluguStop.com - రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గని మిల్కీ బ్యూటీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తమన్నా తాజాగా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది సత్యదేవ్ హీరో గా నటించబోతున్న ‘ గుర్తుందా శీతాకాలం’ అనే రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ లో నటించబోతోంది.ఈ సినిమా కన్నడ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘ లవ్ మాక్ టైల్ ‘ అనే సినిమాకు తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ తో రీమేక్ చేయబోతున్నారు.

ఇక ఇదే వరుసలో టాలీవుడ్ హీరో నితిన్ నటించబోతున్న సినిమాలో కూడా తమన్నా నటించనున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ రోల్ కాకపోయినప్పటికీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.‘ అంధాదున్ ‘ అనే సినిమాకు రీమేక్ రాబోతున్న ఈ సినిమాలో తమన్నా భాటియా కీలకపాత్ర పోషించబోతుంది.

ఇకపోతే ఈ రెండు సినిమాలకు తమన్నా భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమాలో పూర్తి రోల్ నటించినా, నటించకపోయినా… తాను నటించే పాత్ర సమయం ఎంత సేపు ఉన్న, హీరోయిన్ అయినా కాకపోయినా, నెగిటివ్ రోల్ అయినా కూడా బిగ్ స్క్రీన్ మీద కనబడేందుకు మాత్రం తమన్నా కచ్చితంగా రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు చిత్ర పరిశ్రమ టాక్.అయితే ఇప్పటికే ‘ గుర్తుందా శీతాకాలం ‘ అనే సినిమా కోసం రెండు కోట్లకు అగ్రిమెంట్ చేసుకుంటున్నట్లు టాక్.

ఇది అలాగే హీరో నితిన్ రీమేక్ చేయబోతున్న సినిమాలో తమన్నా నటిస్తున్నప్పటికీ చిత్ర బృందం ఆమె ఏదో కాస్త బేరసారాలు చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్.ఈ సినిమా కాస్త క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడంతో తమన్నా పారితోషికం విషయంలో ఓ మెట్టు దిగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

#Nithin #Thamanna Batiya #TamannaDemands #Remuneration #TamannaWith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamanna 2crores Remuneration Gurthunda Seethakalam Related Telugu News,Photos/Pics,Images..