శేఖర్ మాస్టర్ తో కలిసి కళావతి పాటకు స్టెప్పులు వేసిన తమన్... వీడియో వైరల్!

పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారీ వారి పాట నుంచి ఫిబ్రవరి 13వ తేదీ కళావతి అనే పాట విడుదలైన సంగతి తెలిసిందే.ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది.

 Taman Steps With Shekar Master On Kalaavathi Song, Taman, Shekar Master, Kalaava-TeluguStop.com

ఈ పాటకు ఎంతోమంది డాన్స్ వేస్తూ ఆ డాన్స్ వీడియో లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.ఇప్పటికే మహేష్ బాబు కూతురు సితార ఈ పాటకు అద్భుతమైన డాన్స్ వేశారు.

అలాగే శేఖర్ మాస్టర్ పిల్లలు సైతం కళావతి పాటకు డాన్స్ చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ పాటకు ఎంతోమంది డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్న వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తమను సైతం ఈ పాటకు ఎంతో సిగ్గుపడుతూ మహేశ్ బాబు వేసిన హుక్ స్టెప్‌ని, డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌తో కలిసి వేశారు.ఇక డాన్స్ వీడియోని స్వయంగా తమన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో పై స్పందించిన నెటిజన్లు సంగీత దర్శకుడు తమన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.తమన్ అధిక శరీర బరువు ఉన్నప్పటికీ ఈ పాటకు ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు అంటూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు.మరికొందరు తమన్ మల్టీ టాలెంటెడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube