ఎన్టీఆర్‌ కోసం కూడా కాపీ ట్యూన్సేనా తమన్‌..?     2018-09-21   08:57:21  IST  Ramesh P

సంగీత దర్శకుడు తమన్‌ పై ఎప్పుడు కూడా కాపీ విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. గతంలో పలువురు స్టార్‌ హీరో సినిమాల కోసం ఇతర చిత్రాల నుండి, ఇతర పాటల నుండి ట్యూన్స్‌ను కాపీ చేశాడు అంటూ విమర్శలు ఉన్నాయి. టాలీవుడ్‌లో ఎంతో మంది సంగీత దర్శకులు కాపీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాని తమన్‌ మాత్రం మరింత ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈయన స్టార్‌ హీరో సినిమాలకు కూడా సొంతంగా ట్యూన్స్‌ను చేయలేక పోతున్నాడు అంటూ అంతా సోషల్‌ మీడియాలో ఎద్దేవ చేస్తున్నారు. తాజాగా అరవింద సమేత చిత్రంలోని పాటలను కూడా ఇతర పాటల నుండి ఇన్సిపిరేషన్‌గా తీసుకుని ట్యూన్‌ చేసినట్లుగా సినీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి.

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. తన చిత్రాలకు ఎప్పుడు దేవిశ్రీ ప్రసాద్‌తో సంగీతాన్ని ఇప్పించే త్రివిక్రమ్‌ ఈసారి మాత్రం తమన్‌తో వర్క్‌ చేశాడు. తమన్‌పై విమర్శలు ఉన్నా కూడా తనకు వేరే దారి లేక తప్పనిసరి పరిస్థితుల్లో త్రివిక్రమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. త్రివిక్రమ్‌ మంచి ట్యూన్స్‌ను తమన్‌ నుండి తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కాని ఈ చిత్రానికి కూడా తమన్‌ కాపీ ట్యూన్స్‌ ఇచ్చాడు.

Thaman Aravinda Sametha First and Second Songs Copied-Anaganaganaga Songs Copied,Nandamuri Fans,Ntr,Penimiti Song,Thaman

ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి అనగనగా.. పాట ‘ఓ మై ఫ్రెండ్‌’ సినిమాలోని పాటకు కాపీ అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ నడుస్తుంది. సోషల్‌ మీడియాలో రెండు పాటలను పక్క పక్కన పెట్టి ట్రోల్‌ చేస్తున్నారు. ఇక పెనిమిటి పాట కూడా కాపీ అనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. పండగ చేస్కో చిత్రంలోని ఒక పాటను తమన్‌ ఈ చిత్రం కోసం కాపీ చేశాడు. పండగ చేస్కో సినిమాను ఈయన చేసిన విషయం తెల్సిందే. తన పాటను తానే ఈ చిత్రం కోసం తమన్‌ కాపీ చేసినట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

ఈ విమర్శలు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు కాస్త ఇబ్బందిగా ఉన్నాయి. ఎన్టీఆర్‌ కోసం అయినా తమన్‌ మంచి ట్యూన్స్‌ను, సొంత ట్యూన్స్‌ను ఇచ్చి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు ట్యూన్స్‌ కాపీ వ్యవహారం మైనస్‌ అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.