అమెరికాలో తామా చదరంగ పోటీలు..!!!  

Tama Chess Tournament In America - Telugu America, Chess, Chess Tournament, Nri News, Tama, , Telugu Nri

అమెరికాలోని అత్యధికంగా ఉన్న సంఘాలలో తెలుగు సంఘాలు అధిక సంఖ్యలో ఉంటాయి.ఆయా ప్రాంతాలకి తగ్గట్టుగా తెలుగు ప్రజలు అక్కడ సంఘాలని ఏర్పాటు చేసుకున్నారు.

Tama Chess Tournament In America - Telugu Nri News Tama

ఎవరు ఎలాంటి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నా సరే ప్రతీ సంఘం యొక్క ప్రధాన లక్ష్యం తెలుగు ప్రజలకి సేవ చేయడం, అమెరికాలో తెలుగు వారికి తోడుగా ఉండటం, తెలుగు సంస్కృతీ సాంప్రదాయలని గౌరవించడం.
ఈ ఆశయాలతోనే అమెరికాలో ఉన్న అట్లాంటా తెలుగు సంఘం తామా పని చేస్తోంది.

తన ఆధ్వర్యంలో ఎన్నో సేవా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ గడిచిన 6 ఏళ్ళుగా విశిష్ట సేవలు అందిస్తోంది.ఇప్పటి వరకూ 10 సార్లు చదరంగ పోటీలు నిర్వహించి పిల్లలలో సృజనాత్మకతని వెలికి తీస్తున్న తామా, ఈ సారి 11 వ చదరంగ పోటీలని నిర్వహించింది.

ఈ పోటీలలో పిల్లలు ఎంతో ఉశ్చాహంగా పాల్గొన్నారు.ప్రతీ విభాగంలో మొదటి 5 విజేతలకి తామా ట్రోఫీలు అందించారు.అలాగే

వివిధ రకాల విజేతలకి కూడా బహుమతులు అందించారు.తామా లో యువత, క్రీడల విభాగానికి చెందిన వెన్నెలకంటి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకి ఎంతో మంది తెలుగు వారు విచ్చేశారు.అలాగే తామాలో ఉన్న ప్రతీ విభాగానికి చెందిన లీడర్స్ అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేశారు.ఈ సందర్భంగా తామా అధ్యక్షుడు భారత్ మాట్లాడుతూ విచ్చేసిన ప్రతీ ఒక్క తెలుగు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వార్తలు