మ‌రోసారి అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చిన తలైవా..! ఆ నిర్ణయం పై వీడని స‌స్పెన్స్..!  

భారతదేశంలో ఎంతోమంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులు మంత్రులు అయిన వారు ఎందరో ఉన్నారు.అలా కొంతమంది సినీ నటులు వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాలలో ఎన్నో మార్పులు కూడా సంభవించాయి.

TeluguStop.com - Taliva Disappointed The Fans Once Again Weedy Suspense Over That Decision

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో సినీ నటుల ప్రభావం రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు కనబడుతోంది.అయితే తమిళనాడు రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా మార్పులు సంభవించాయని చెప్పవచ్చు.

ఇందులో భాగంగానే ఆ రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం రాష్ట్రానికి సరైన నాయకుడు లేరని అక్కడ ప్రజలు భావిస్తున్న సమయంలో తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన నటులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇష్టం చూపిస్తున్నారు.

TeluguStop.com - మ‌రోసారి అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చిన తలైవా.. ఆ నిర్ణయం పై వీడని స‌స్పెన్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image
Telugu Fans, Movies, Political Party, Politics, Rajini Kanth, Tamilnadu, Telivision Media-Latest News - Telugu

ఇందులో భాగంగానే తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, అలాగే నేషనల్ హీరో అయిన కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పవచ్చు.ఇదివరకే కమల్ హాసన్ ఓ పార్టీ పెట్టి అనేక ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం అందరికి తెలిసిందే.అలాగే రజనీకాంత్ రజిని మక్కల్ మండల్ ఏర్పాటు చేసి అందుకు సంబంధించి కార్యవర్గ నిర్వాహకం అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేశారు తప్పించి పార్టీపై ఎలాంటి పూర్తి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే రజనీకాంత్ తన పార్టీపై అక్టోబర్ నెలలో క్లారిటీ ఇస్తారని భావించినా కరోనా వైరస్ వల్ల అది కూడా కాస్త పెండింగ్ పడిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.అయితే తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ ఎలక్షన్స్ దగ్గరకు రావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయంపై తాజాగా రజనీకాంత్ తన పార్టీ సభ్యులతో భేటీ అయ్యారు.

అలా సమావేశం అయిన తర్వాత ఆయన మీడియాతో చర్చించారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సంఘాలతో చర్చించామని, తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్న వారందరూ మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నారు అంటూ రజనీకాంత్ చెప్పాడు.

దీంతో ఆయన వీలైనంత వరకు తన నిర్ణయం త్వరగా ప్రకటిస్తాం అని తెలియజేశాడు.దీంతో రజనీకాంత్ ఎప్పుడెప్పుడు రాజకీయ పార్టీని చేస్తాడా అని వేచి ఉన్న మీడియా, ఆయన అభిమానులకు, తమిళ రాష్ట్ర ప్రజలకు నిరాశే ఎదురైంది.

చూడాలి మరి రజినీకాంత్ రాజకీయ పార్టీని మొదలుపెట్టడానికి ఇంకెంత సమయం తీసుకుంటారో.

#Rajini Kanth #Political Party #Movies #Politics #Tamilnadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు