జ‌మ్ముక‌శ్మీర్‌లోని ముస్లింలు మావాళ్లే: తాలిబ‌న్ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

న్యూఢిల్లీ: ఒకవైపు దోహాలో భారత్‌తో చర్చలు జరిపిన తాలిబన్లు… మరోవైపు కాశ్మీర్ అంశంపై వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న‌లు చేశారు.చైనాలో ఉఘుర్ ముస్లింల అణచివేతపై మౌనం వ‌హించిన‌ తాలిబన్లు, జమ్మూక‌శ్మీర్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా త‌మ‌వారేన‌ని, వారి కోసం మాట్లాడే హక్కు తమ‌కు ఉందని ప్ర‌క‌టించారు.

 Taliban We Have The Right To Raise Our Voice For The Muslims Of Jammu And Kashmi-TeluguStop.com

 తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ ఈ విధ‌మైన ప్రకటన చేశారు.కాశ్మీర్ అంశంపై అల్‌కైదా త‌మ‌ సహాయం కోరినట్లు తాలిబ‌న్లు ప్ర‌క‌టించిన నేప‌ధ్యంలో, వారు ఈ కొత్త వివాదానికి తెర‌లేపారు.

అయితే ఇంత‌కుముందు తాలిబన్ నేత‌లు తాము భారత్‌, పాక్ వ్య‌వ‌హారంలో త‌ల‌దూర్చ‌మ‌ని తెలిపారు.అలాగే ఆ ప్రాంతాన్ని ఏ దేశానికీ వ్యతిరేకంగా ఉపయోగించడానికి తాము స‌మ్మ‌తించ‌మ‌ని తెలిపారు.

మీడియాతో తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ మాట్లాడుతూ జమ్ముక‌శ్మీర్‌లోని ముస్లింల కోసం మాట్లాడే హక్కు తమ సంస్థకు ఉందని స్ప‌ష్టం చేశారు.

అమెరికాతో దోహా ఒప్పందాన్ని ప్రస్తావించిన ఆయ‌న ఏ దేశానికీ వ్యతిరేకంగా సాయుధ ప్రచారాన్ని ప్రారంభించబోమని పేర్కొన్నారు.

 ఒక ముస్లింగా, భార‌త్‌లోని క‌శ్మీర్ లేదా మరే ఇతర దేశాల‌లోని ముస్లింల కోసం మాట్లాడే హక్కు త‌మ‌కు ఉంద‌ని షాహీన్ పేర్కొన్నారు.ముస్లింల సమానత్వం కోసం అన్ని దేశాలకు విజ్ఞప్తి చేస్తామ‌న్నారు.

 ఆగస్టు 31 న భారత్‌ మొదటిసారిగా తాలిబన్లతో అధికారిక చర్చలు జరిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube