మ‌న బిర్యానీపై ప్ర‌భావం చూపిస్తున్న తాలిబ‌న్లు.. ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం?

మ‌న హైద‌రాబాద్ బిర్యానీకి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.నిజంగా చెప్పాంటే హైద‌ర‌బాద్ అంటే బిర్యానీ గుర్తుకు వ‌స్తుంది ఇత‌ర రాష్ట్రాల్లోని వారికి.

 Taliban Influencing Biryani .. Is There A Chance Of Rising Prices Taliban, Birya-TeluguStop.com

అంత‌లా మ‌న బిర్యానీ పేరు సంపాదించుకుంది.వేరే రాష్ట్రాల వారు కూడా మ‌న హైద‌రాబాద్‌కు వ‌చ్చి మ‌రీ బిర్యానీని టేస్ట్ చేస్తుంటారు.

ఇక ఈ బిర్యానీ అయితే మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌తి ఊరిలో ఇప్పుడు దొర‌కుతోంది.ఇప్పుడు దాదాపుగా చిన్న చిన్న ప‌ల్లెల్లూ కూడా బిర్యానీ పాయింట్ లు మ‌న‌కు క‌నిపిస్తుంటాయి.

అంత‌లా బిర్యానీ మ‌న జీవితంలో భాగం అయిపోయింది.

రుచికి రుచి అలాగే త‌క్కువ ధ‌ర‌లు ఉండ‌టంతో అంద‌రూ బిర్యానీ తినేందుకు ఇష్ట‌ప‌డుతారు.

కాగా ఇంత వ‌ర‌కు ఇలా త‌క్కువ ధ‌ర ఉన్న బిర్యానీ త్వ‌ర‌లోనే దీని ధర ఆకాశాన్ని తాకే పరిస్థితి ఉంద‌ని తెలుస్తోంది.దానికి కార‌ణం ఆఫ్గనిస్తాన్ ను ఇప్పుడు తాలిబన్లు స్వాధీనం చేసుకోవ‌డ‌మే.

ఇక వారు అధిక‌రాంలోకి వ‌చ్చిన త‌ర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలు ప్ర‌పంచాన్ని కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.అయితే బిర్యానీ ధ‌ర‌లు ఎందుకు పెరుగుతాయంటే దీని తయారీలో వినియోగించే డ్రైఫ్రూట్స్ అయితే ఎండుద్రాక్ష, అల్మండ్, అత్తి, పిస్తాపప్పు, జీడిపప్పు లాంటివి మ‌నం ఆఫ్గనిస్తాన్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం.

Telugu Biryani, Dry Fruits, Export, Taliban, Taliban Biryani, Talibans-Latest Ne

ఇక ఆఫ్గాన్ లో ఇప్పుడున్న ప‌రిస్థితుల కార‌ణంగా ఈ డ్రై ఫ్రూట్స్ ను ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌న దేశానికి ఎగుమ‌తి చేయ‌డాన్ని ఆపేసింది.దీంతో వీటికి అత్య‌ధికంగా డిమాండ్ పెరుగుతోంది.ఈ కార‌ణాల వ‌ల్ల‌నే బిర్యానీ తయారీ ఖ‌ర్చులు విప‌రీతంగా పెరిగే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.ఇలాగే కొద్ది కాలం భారంగా మారితే మాత్రం క‌చ్చితంగా బిర్యానీ ధర పెంచక తప్పదని రెస్టారెట్లు న‌డుపుతున్న వారు హెచ్చరిస్తున్నారు.

డ్రై ఫూట్స్ కొరత ఎక్కువైతే గ‌న‌క అవి లభించక బిర్యానీ టేస్ట్ ఇంత‌కు ముందు లాగా కాకుండా వేరే విధంగా మారే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube