ఇది మామూలు కుక్క కాదు..!

సాధారణంగా ఎవరైనా మంచుతో కప్పబడిన ప్రదేశాలకు వెళితే ఎత్తైన ప్రదేశం నుండి కిందకు జారడానికి అమితంగా ఇష్టపడతారు.పిల్లల నుండి పెద్దవాళ్లవారకు ఇలా జారడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు.

 Talent Dog Video Goes Viral In Internet-TeluguStop.com

ఎత్తైన ప్రదేశం నుండ్ కిందకు జారడాన్ని ఇంగ్లీష్ లో స్లీఘ్ రైడ్ అని అంటారు.ఇలా ఎత్తైన ప్రదేశం నుండి కిందకు మనుషులు జారడంలో ఎటువంటి వింత లేదు.

కానీ ఒక కుక్క కూడా మంచు ప్రాంతంలో ఎత్తైన ప్రదేశం నుండి కిందకు జారుతూ ఆడుకుంటోంది.

మంచు ప్రాంతంలో మనుషుల మాదిరిగానే కుక్క జారుతూ ఉన్న వీడియోను ఒక వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియోను అక్కీ అనే పేరు ఉన్న వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఫోటోతో పాటూ అక్కీ తన ట్విట్టర్ ఖాతాలో ” ఈరోజు మీరు చూసిన అతి గొప్ప విషయం ఇదే అనుకుంటా” అని క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశాడు.

వేల సంఖ్యలో ఈ వీడియోకు కామెంట్లు, షేర్లు వస్తుండగా ఇప్పటికే ఈ వీడియోను 5 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం.

కుక్క ఎత్తైన ప్రదేశంలో జారడం వింతేముంది…? ఈ కుక్క ప్రత్యేకత ఏమిటి అనే అనుమానాలు రావచ్చు.ఈ కుక్క తన నోటితో జారడానికి అవసరమైన ప్లాస్టిక్ స్లిఘ్ను తన నోటితో పట్టుకొని కిందకు జారడం గమనార్హం.బాలీవుడ్ హీరోలు కూడా ఈ కుక్కకు సంబంధించిన వీడియోను చూసి తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ కంటే ఈ కుక్క స్మార్ట్ అంటూ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ కామెంట్ చేశాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube