ఏపీలో తలసాని యాదవ గర్జన! టీడీపీకి ఇబ్బందేనా ...?

తమకు అవసరం లేకపోయినా టీఆర్ఎస్ పార్టీ ఏపీ రాజకీయాల్లో వేలుపెడుతోంది.రకరకాల ప్రకటనలు … విమర్శలు చేస్తూ… ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతూ….

 Talasani Yadav Garjana In Andhra Pradesh-TeluguStop.com

చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.ఈ విషయంలో కేసీఆర్, తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు.

ఈయనకు ఏపీ లో చాలామంది బంధువులే ఉన్నారు.అందుకే తరుచూ… ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు.

అదీ కాకుండా ఏపీ లో ప్రధానంగా ఉన్న యాదవ సామజిక వర్గం తలసాని యాదవ్ ను ఆరాధిస్తూ ఉంటారు.ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు ని ఇబ్బంది పెట్టడానికి టీఆర్ఎస్ పార్టీకి దొరికిన పెద్ద అస్త్రంగా కనిపిస్తున్నాయి.

ఈ నేప్సాధ్యంలోనే ఏపీలో ఓ భారీ బహిరంగ సభ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు తలసాని.అంతేకాకుండా… ఆ బహిరంగ సభ తరువాత ఏపీలోని అనేక జిల్లాల్లో కూడా పర్యటించేందుకు శ్రీనివాస్ యాదవ్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.ఈ పర్యటనలో ముఖ్యంగా… బీసీ, యాదవ సంఘాలను ఐక్యం చేస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.మార్చి 3న గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్డులో యాదవ బీసీ గర్జన బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.
ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో ప్రభుత్వ పాలన సక్రమంగా లేదని విమర్శలు గుప్పించారు.

వచ్చే ఎన్నికల్లో సరికొత్త తీర్పు ఇవ్వడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.చంద్రబాబు ప్రకటించే పథకాలు మార్చి నెల వరకే అని.పథకాలు అమలు చేయడానికి ఖజానాలో డబ్బులు లేవన్నారు.ఏపీ రాష్ట్రంలో తనను కలిసిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని.నేను వస్తుంటే ఏపీ పోలీసులు కండీషన్స్ పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.నాకు ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు మరి ఏపీ నాయకులు తెలంగాణాలో ప్రచారం చేయలేదా అని మండిపడ్డారు.ప్రజలకు ఎన్నికల ముందు పప్పు బెల్లాలు పెడుతూ… ఆకట్టుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

అయితే తలసాని వ్యాఖ్యలపై ఇంకా టీడీపీ నుంచి ఎదురుదాడి మొదలవ్వలేదు.కాకపోతే ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఈ విధంగా కుల సంఘాలతో ఏపీలో మీటింగ్ లు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూడడంపై ఆందోళన చెందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube