హైదరాబాద్‌ పంజాగుట్ట శ్మశాన వాటికకు నూతనంగా ఏర్పాటు చేసిన స్టీల్‌ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ ..

హైదరాబాద్‌ పంజాగుట్ట శ్మశాన వాటికకు నూతనంగా ఏర్పాటు చేసిన స్టీల్‌ బ్రిడ్జ్‌ను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ ప్రారంభించారు హైదరాబాద్​ అభివృద్ధి కోసం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రులు కొనియాడారు.

 Talasani Srinivas Yadav And Mahmood Ali Inaugurated The Newly Constructed Steel-TeluguStop.com

Panjagutta Flyoverహైదరాబాద్​లోని పంజాగుట్ట శ్మశానవాటికపై రెండో పైవంతెన ప్రారంభమైంది.

మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మహమూద్​ అలీ పైవంతెనను ప్రారంభించారు.ఈ వంతెనతో పంజాగుట్ట నాగార్జున కూడలి వద్ద ట్రాఫిక్​ సమస్య తీరనుంది.

నాగార్జున కూడలి నుంచి కేబీఆర్​ పార్కు కూడలి వైపు రాకపోకలు సాఫీగా సాగనున్నాయి.

ఈ రోజు నుంచి వంతెన ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.

హైదరాబాద్‌ అభివృద్ధికోసం సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.పంజాగుట్ట శ్మశానవాటికలోని ఉక్కుదిమ్మలపై వంతెనను నిర్మించారు.

శ్మశానవాటిక సమాధుల పైనుంచి చట్నీస్​ హోటల్​ వైపు వెళ్లేలా.ఉక్కు వంతెనను తీర్చిదిద్దారు.

ఈ కార్యక్రమంలో మేయర్​ విజయలక్ష్మి, డిప్యూటీమేయర్‌, ఇతర తెరాస నేతలు పాల్గొన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube