సాగర్ ప్రచారంలో యాక్టివ్ గా తలసాని... అసలు కారణం ఇదే?

తెలంగాణలో త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.అయితే ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ఎవరికి వారు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు.

 Reason Behind Talasani Active In Elections Campaign, Nagarjuna Sagar Elections C-TeluguStop.com

సాగర్ బరిలో మొత్తం 70 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల మీద గట్టిగా ఫోకస్ పడే అవకాశం ఉంది.అయితే బీజేపీ ఈ నాగార్జున సాగర్ రేసులో ప్రధాన పోటీ దారుగా నిలుస్తుందని భావించినా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్యాడర్ లేకపోవడం ఒక కారణమైతే ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం, బీజేపీ కీలక నేతలు టీఆర్ఎస్ కు మద్దతు తెలపడంతో బీజేపీకి గట్టి అభ్యర్థులు లేకుండా పోయారు.

అయితే ఇక కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యే రసవత్తర పోరు జరగనుంది.అయితే సాగర్ లో గెలుపుకు కేసీఆర్ ప్రత్యేక వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా ఉంటున్న నేతలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకరు.అయితే మంత్రి తలసానిని రంగంలోకి దించడానికి ప్రత్యేక వ్యూహం దాగి ఉంది.

అదేంటంటే నాగార్జున సాగర్ లో యాదవ్ సామాజిక వర్గ ఓట్ల శాతం ఎక్కువ.మొత్తం 36 వేల ఓట్లు నాగార్జున సాగర్ నియోజకవర్గం లో ఉన్నాయి.

మంత్రి తలసాని యాదవ్ సామాజిక వర్గం కాబట్టి తన సామాజిక వర్గం నేతలతో తరచుగా భేటీ అవుతూ తెరాస గెలుపుకు కృషి చేయాలని మంత్రి తలసాని సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube