'తలైవి' ఫస్ట్ లుక్, టీజ‌ర్ విడుద‌ల‌  

Talaivi First Look And Teaser Release-kangana Ranuth,prakash Raj,talaivi

ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది.ఒక్కప్పుడు బాలీవుడ్ కు మాత్రమే పరిచయం అయిన ఈ ట్రెండ్ కాస్త ఇప్పుడు దక్షిణాది సినిమాలపైన ప్రభావం చూపిస్తుంది.

Talaivi First Look And Teaser Release-kangana Ranuth,prakash Raj,talaivi Telugu Tollywood Movie Cinema Film Latest News Talaivi First Look And Teaser Release-kangana Ranuth Prakash Raj Talaivi-Talaivi First Look And Teaser Release-Kangana Ranuth Prakash Raj

తెలుగు,తమిళ బాషలో ఈ మద్య కాలంలో వచ్చిన ‘మహానటి’ సినిమా చాలా పెద్ద విజయం సాదించింది.మహానటి సావిత్రి జీవితం ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాడు, దర్శకుడు నాగ్ అశ్విన్.

అదే స్ఫూర్తి తో సురేందర్ రెడ్డి, మెగా స్టార్ చిరంజీవితో, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను సైరా నరసింహా రెడ్డి పేరుతో సినిమా తీసి పెద్ద విజయంను దక్కించుకున్నాడు.ఇప్పుడు తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను దర్శకుడు విజయ్ ‘తలైవి’ పేరుతో తెలుగు, తమిళం, హింది బాషలలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

బాలీవుడ్ క్విన్ కంగ‌నా ర‌నౌత్ జయలలిత పాత్రలో నటిస్తుంది.‘తలైవి’ బయోపిక్ లో మరో ముఖ్య పాత్ర, ఎంజీఆర్ ఆ పాత్రలో మలయాళ అందగాడు అరవింద స్వామి నటిస్తున్నాడు.

కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు.శనివారం నాడు తలైవి చిత్రంనకు సంబందినచిన టీజర్, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

జయలలిత జీవితంలో సినిమా రంగానికి, చాలా ప్రాముఖ్యత ఉన్నది.కావునా దానికి సంబందించిన లుక్ ఒక్కటి, మరొక్కటి జయలలిత పొలిటికల్ కెరీర్ దానికి సంబందించిన లుక్ ఒక్కటి రిలీజ్ చేశారు.

జయలలిత పాత్రలో కంగ‌నా ర‌నౌత్ ఒదిగిపోయరంటు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంశలు కురుపిస్తున్నారు.ఈ చిత్రానికి మేకప్ మాన్ గా హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన (బ్లేడ్ రన్నర్, కెప్టెన్ మర్వెల్) మేకప్ ఆర్టిస్ట్ పనిచేస్తున్నాడు.

కావునా కంగ‌నా లుక్ జయలలిత కు దగ్గర పోలికలు ఉన్నట్లు గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.

.

తాజా వార్తలు