తలను దువ్వేది అందం కోసం కాదట.! వెనకున్న అసలు కారణం తెలుస్తే షాక్ అవుతారు.!       2018-06-18   03:44:31  IST  Raghu V

దువ్విన తలనే దువ్వడం…..అంటే అదేదో అందం మీద దృష్టి పెడుతున్నట్టు కాదు..ఆరోగ్యం కోసం కసరత్తులు చేస్తున్నట్టు లెక్క.! ఆశ్చర్యంగా ఉంది కదా.! అవును ఇది నిజం, తలను దువ్వెన పెట్టి దువ్వడం కురులను కుదరుగా ఉంచడానికి అనేది మనకు తెలిసినది కానీ తలను దువ్వడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుందట.! ప్రస్తుత బిజీ లైఫ్ లో వారానికి ఓ సారైనా నూనె పెట్టి దువ్వెనతో తల దువ్వుకోండి ఆరోగ్యమంతంగా ఉండండి.

జుట్టు దువ్వుకున్నప్పుడు కుదుళ్లకు దువ్వెన తాకడం వల్ల అక్కడ ఉన్న రక్తనాళాల్లో చలనం వచ్చి రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. దీంతోపాటు జుట్టుకు కావల్సిన పోషకాలు, ఆక్సిజన్ లభిస్తాయి. ఇది జుట్టు కుదుళ్లను దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. సాధారణంగా మన తలపై ఉండే వెంట్రుకలు సెబమ్ అనే ఓ సహజసిద్ధమైన నూనెను కలిగి ఉంటాయి. అయితే తల దువ్వుకున్నప్పుడు ఈ నూనె జుట్టుకంతా విస్తరింపబడుతుంది. దీంతో వెంట్రుకలు తేమగా, మృదువుగా మారతాయి. జుట్టు కుదుళ్లపై పీహెచ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది.

తల జుట్టును ఎక్కువగా దువ్వుకుంటే పైన తెలిపిన సెబమ్ నూనె వెంట్రుకల చివర్లకు చేరి వాటికి మరింత అందాన్ని, ప్రకాశాన్ని ఇస్తుంది. జుట్టు దువ్వుకున్నప్పుడల్లా కుదుళ్ల వద్ద ఉండే డెడ్ స్కిన్ సెల్స్(చుండ్రు) , ఇతర నిర్జీవ కణాలు బయటికి వెళ్లిపోతాయి. ఇది వెంట్రుకలకు ఎంతో రక్షణనిస్తుంది. దీంతోపాటు వెంట్రుకలు రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.