ఈ పొడిని తీసుకుంటే బీపీ నుంచి మలబద్ధకం వ‌ర‌కు ఎన్నో వ్యాధులు నయం అవుతాయి!

Taking This Powder Cures Many Ailments From BP To Constipation, Constipation, BP, Powder, Ajwain, Fenugreek Seeds, Black Cumin Seeds, Latest News, Health, Health Tips, Good Health

నేటి ఆధునిక కాలంలో బిజీ లైఫ్ స్టైల్, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక పోవడం, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం వంటి ర‌క‌ర‌కాల కారణాల వల్ల మలబద్ధకం, మధుమేహం, హై బీపీ, అధిక బరువు తదితర సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.వీటి నుంచి బయటపడడం కోసం ఎన్నో మందులు వాడుతుంటారు.

 Taking This Powder Cures Many Ailments From Bp To Constipation, Constipation, Bp-TeluguStop.com

అయితే ఇప్పుడు చెప్పబోయే పొడిని తీసుకుంటే కనుక ఆయా సమస్యలన్నీ నయం అవుతాయి.మరియు ఎన్నో ఆరోగ్య లాభాలు సైతం లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల నల్ల జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించుకుని ప్లేట్‌లోరి తీసుకోవాలి.

మళ్ళీ అదే పాన్ లో ఆరు టేబుల్ స్పూన్ల వామును వేసుకుని వేయించుకుని తీసుకోవాలి.

మళ్ళీ అదే పాన్ లో ఒక కప్పు మెంతులు వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న నల్ల జీలకర్ర, మెంతులు, వాము వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్‌ చేసుకోవాలి.ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

Telugu Ajwain, Fenugreek Seeds, Tips, Latest, Powder-Telugu Health Tips

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని వ‌న్ టేబుల్ స్పూన్ చ‌ప్పున కలుపుకుని సేవించాలి.ఈ పొడిని ప్ర‌తి రోజు తీసుకోవడం వల్ల మలబద్ధకం దూరమై జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.వెయిట్ లాస్ అవుతారు.అధిక రక్తపోటు నుంచి ఉపశమనం లభిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

మరియు కీళ్ళ నొప్పులు సైతం తగ్గుముఖం పడతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube