ఆర్డరు ఇచ్చింది బాతు మాంస వంటకం ... ఆవురావురంటూ తిందామని పొతే...??  

Takeaway Customer Finds 40 Dead Cockroaches In Her Meal-duck Meal, Food Dery Platform,takeaway Customer

అసలే విపరీతమైన ఆకలి. ఒక పక్క చిరాకు. ఆన్ లైన్ లో ఆర్డరు ఇచ్చిన భోజనం ఎతకూ డెలివరీ కాదు...

ఆర్డరు ఇచ్చింది బాతు మాంస వంటకం ... ఆవురావురంటూ తిందామని పొతే...??-Takeaway Customer Finds 40 Dead Cockroaches In Her Meal

ఇలాంటి సమయంలో ఆ వచ్చిన భోజనంలో ఒకటి కాదు రెండూ కాదు ఏకంగా 40 బొద్దింకలు చచ్చి పడి వుంటే మీకు ఎలా అనిపిస్తుంది? సరిగ్గా అలాంటిదే జరిగింది దక్షిణ చైనాలోని షాన్టౌ నగరంలో. దీనికి సంభందించిన భయంకరమైన వీడియొ ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్ అవుతోంది.ఆసియా వైర్ అనే పత్రిక కధనం ప్రకారం ఒక మహిళ తన స్నేహితులతో కలసి ఆన్ లైన్ లో ఒక రెస్టారెంటులో బాతుతో చేసిన వంటకానికి ఆర్డరు ఇచ్చింది. ఆ డెలివరీ అయిన బాక్సు తెరచి చూడగా అందులో చచ్చి పడి ఉన్న బొద్దింకలు కనిపించాయి.

వారి సందేహం వచ్చి, చైనీయులు ఆహారం తీసుకోడానికి వాడే చాప్ స్తిక్క్స్ తో తరచి తరచి చూడగా వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40కి పైగా చనిపోయిన బొద్దింకలు అందులో దర్శనమిచ్చాయి. అవి ఆహారంలో కలసి పోయి వుండటం చేత వాటిని కనిపెట్టి ఏరి వేయడం చాలా కష్టం అయింది వారికి.

ఇలా కాదని మొత్తం వ్యవహారాన్ని విడియూ తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసారు. అంతే కాకుండా దీనిమీద రెస్టారెంట్ యాజమాన్యానికి మరియు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. అది అస్సలే చైనా దేశం.

చాలా కట్టినమైన నిబందనలు పాటిస్తారు అక్కడ. ఇంకేముంది వెటనే సదరు రెస్టారెంట్ ను సీజ్ చేసి స్థానిక ఫుడ్ అండ్ డ్రగ్ యంత్రాంగంతో కలిపి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు ఏషియా వైర్ మరియు మిర్రర్ పత్రికలూ తెలిపాయి