బైక్ తీసుకొని బాధితులకు ఆక్సిజన్ అందించండంటున్న యువ హీరో..!

ప్రస్తుతం దేశపరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే.గత ఏడాది నుండి పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లే పట్టి.

 Take My Bike And Give Oxygen To The Victims Says Harsha Vardhan Rane-TeluguStop.com

మళ్లీ వెంటాడుతుంది.ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత తీవ్రంగా ఉందని తెలుస్తుంది.

రోజురోజుకు లక్షల సంఖ్యలో పెరుగుతున్న కేసుల సంఖ్యలను చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు ప్రాణాలు వదిలేస్తున్నారు.

 Take My Bike And Give Oxygen To The Victims Says Harsha Vardhan Rane-బైక్ తీసుకొని బాధితులకు ఆక్సిజన్ అందించండంటున్న యువ హీరో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Celebrities, Harsha Vardhan Rane, Hyderabad, Oxygen-Movie

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలు, పలు రంగాలు మూతపడగా.సెలబ్రిటీలంతా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పలు జాగ్రత్తలు తెలుపుతున్నారు.అంతేకాకుండా సోనూసూద్ లాంటి ఎందరో సెలబ్రెటీలు తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా వంటి నటులు తమ వంతు సహాయాన్ని అందించగా.

తాజాగా మరో యంగ్ హీరో హర్షవర్ధన్ రాణే.తన వంతు సహాయం తో ముందుకు వచ్చాడు.

హీరో హర్షవర్ధన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని అనుకున్నాడేమో గాని.

తనకిష్టమైన ఫ్యాన్సీ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను ఇవ్వడానికే సిద్ధమయ్యాడు.తన బైక్ తీసుకొని బాధితులకు సహాయం చేయాలని, కరోనా పేషంట్స్ కు ఆక్సిజన్ అందించాలని కోరాడు.

తన బైక్ తీసుకొని సహాయం అందించగలరని తెలుపుతున్నారు.దయచేసి హైదరాబాద్ లో ఎవరైనా కాంట్రాక్టర్స్ ఉంటే సహకరించండి అంటూ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయం గురించి స్టేటస్ లో తెలిపాడు.

తను బైక్ ను కడుగుతున్న ఫోటో కూడా షేర్ చేసాడు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.

ఈయన చేస్తున్న సహాయాన్ని చూసి నెటిజనులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

#Celebrities #HarshaVardhan #Oxygen #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు