డెంగ్యూ వస్తే ఏం చేయాలి?     2016-10-27   05:18:43  IST  Raghu V

ఈరోజుల్లో డెంగ్యూ కేసులు బాగా కనబడుతున్నాయి. చుట్టప్రక్కల శుభ్రత లేకపోవడం వలన కావచ్చు, వైరల్ ఫంగస్ కి ఇమ్యూనిటి సిస్టమ్ తట్టుకోలేకపోవడం వలన కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, డెంగ్యూ వస్తే కేవలం డాక్టర్ పైనే భారం వేసేయ్యకుండా మనవంతుగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

* ఇమ్యూనిటి లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు కారం ఎక్కువ ఉండే ఆహారం, ఫ్యాట్స్ ఎక్కువ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు. స్పైసీ ఫుడ్స్ పరిస్థితిని మరింత దారుణంగా తాయారుచేస్తాయి.

* డెంగ్యూ పెషెంట్స్ కి మెడికేషన్ వలన మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైబర్ బాగా లభించే ఆహారం తింటూ ఉండాలి. జామకాయలు బాగా ఉపయోగపడతాయి ఇలాంటి సమయంలో.

* సులువుగా జీర్ణం అయ్యే ఆహారమే తీసుకోవాలి. ఇడ్లీ కాని, ఉప్మా కాని ప్రిఫర్ చేయాలి. ముఖ్యంగా ఇడ్లీలో లభించే న్యూట్రింట్స్ మీ శరీరానికి అలాంటి సమయంలో అవసరం.

* పపాయ ఆకులతో జ్యూస్ చేసుకోని తాగితే, డెంగ్యూ పెషెంట్స్ ఉపశమనాన్ని పొందుతారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి.

* ఆపిల్, ఆరెంజ్, స్వీట్ లైమ్, జామకాయలు లాంటి ఫలాల్ని బాగా తినాలి, కొబ్బరినీరు బాగా తాగాలి.

* డెంగ్యూ వచ్చినవారు దోమకాటు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి.