పాములతో మసాజ్‌ సరే కాని, కత్తులతో కూడా మసాజ్‌ ఏంట్రా బాబు.. అటు ఇటు అయితే పరిస్థితి ఏంటీ?

మసాజ్‌ సెంటర్లకు తాయిలాండ్‌ మరియు చైనాలు చాలా ఫేమస్‌ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ రెండు దేశాలకు విదేశాల నుండి వెళ్లి మరీ మసాజ్‌లు చేయించుకుంటారు.

 Taiwans Age Old Tradition Of Massaging With Knives-TeluguStop.com

ఇండియాలో ఉండే మసాజ్‌ సెంటర్‌లలో మసాజ్‌ కంటే అసాంఘీక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి.కాని అక్కడ మాత్రం పక్కా ప్రొఫెషనల్‌గా మసాజ్‌ సెంటర్లు జరుగుతాయి.

కొత్త కొత్త పద్దతుల్లో మసాజ్‌ సెంటర్లలో కస్టమర్లకు మసాజ్‌ను చేస్తూ ఉంటారు.తాజాగా మసాజ్‌ సెంటర్లలో కొత్తరకం మసాజ్‌లను మొదలు పెట్టారు.

అదే నైఫ్‌ మసాజ్‌, ఈ రకం మసాజ్‌లు ప్రాణాలతో చెలగాటమే అయినా కూడా జనాలు విపరీతంగా ఇష్టపడుతున్నారు.

చైనాలోని కొన్ని మసాజ్‌ సెంటర్లు ఈ తరహా మసాజ్‌లను మొదలు పెట్టాయి.

మసాజ్‌ చేసేందుకు మనిషి బాడీపై ఒక మందపాటి బ్లాంకెట్‌ను కప్పడం జరుగుతుంది.ఆ బ్లాంకెట్‌పై చాలా పదునైన కత్తిని సున్నితంగా తాగడం జరుగుతుంది.

అలా సున్నితంగా కత్తితో మసాజ్‌ చేయడం వల్ల నరాలు ఉత్తేజితం అయ్యి, ఒంట్లోని టెన్షన్‌తో మొత్తం బాడీ పార్ట్స్‌ అన్ని కూడా కదులుతాయని నిపుణులు అంటున్నారు.వైధ్యులు కూడా ఈమసాజ్‌ వల్ల మంచి ఉపయోగం ఉందని చెబుతున్నారు.

మొత్తానికి ఈ బాడీ మసాజ్‌లతో పెద్ద మొత్తంలో డబ్బులను కూడా సంపాదిస్తున్నారు.

చైనాలో పాములతో కూడా మసాజ్‌లు చేస్తున్న విషయం తెల్సిందే.కోరలు తీసేసిన పాములతో మసాజ్‌ చేయించుకుంటారు.అయితే 50 కిలోల బరువు ఉన్న పాముతో మసాజ్‌ చేయించుకోవడం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది.

ఒకమనిషిని పడుకోబెట్టి అతడిపైకి బరువైన పామును వదులుతారు.అలా స్నేక్‌ మసాజ్‌ అవుతుంది.

పాము రక్తం చాలా చల్లగా ఉండటంతో పాటు, పాము శరీరంపై ఉండే ఒక విభిన్నమైన రాపిడి మనిషి శరీరానికి చాలా శాంత్వన ఇస్తుంది.అందుకే పాము మసాజ్‌ వల్ల మంచి లాభం ఉందని అంటున్నారు.

పాము మసాజ్‌ వల్ల లాభం ఉంది, దాంతో చేయించుకుంటే పర్వాలేదు, కాని కత్తులతో మసాజ్‌ ఏంట్రా బాబోయ్‌ అనిపిస్తుంది కదా.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube