బాహుబలి సినిమాకి ఫిదా అయిపోయిన తైవాన్ మంత్రి

ఇండియన్ సినిమా రేంజ్ కి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘటన బాహుబలి సినిమాకి దక్కుతుంది.ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న చిత్రంలో బాహుబలి సిరీస్ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.

 Taiwan Foreign Minister Joseph Wu Favorite Indian Movie Baahubali, Tollywood, Bo-TeluguStop.com

అలాగే లాంగ్వేజ్ బారియర్స్ ని చెరిపేసి రిలీజ్ అయిన అన్ని బాషలలో సూపర్ హిట్ అయిన బాహుబలి సినిమా ఏకంగా రెండు వేల కోట్లకి పైగా కలెక్షన్ సొంతం చేసుకొని దర్శకుడు రాజమౌళి క్రేజ్ ని ఇండియన్ వైడ్ చేసింది.అలాగే డార్లింగ్ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.

బాహుబలి సినిమా విదేశీ బాషలలో కూడా విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది.చైనా, జపాన్ బాషలలో ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు.

జపాన్ ప్రేక్షకులకి బాహుబలి సినిమా ఎంతగా కనెక్ట్ అయ్యింది అంటే ఇందులో పాత్రలని కార్టూన్ బొమ్మలుగా మార్చి మార్కెట్ లో తీసుకొచ్చే స్థాయిలో ఉంది.ఇదిలా ఉంటే అంతర్జాతీయ టెక్నీషియన్స్ ని కూడా ఈ సినిమా మెప్పించింది.

బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా మీద కూడా హాలీవుడ్ ద్రుష్టి పెట్టింది.
ఈ నేపధ్యంలో రాజమౌళి సినిమాలో ఏకంగా ఇద్దరు హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు.

అలాగే నిశ్శబ్దం సినిమాలో కూడా హాలీవుడ్ నటుడు నటించాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు బాహుబలి సినిమాకి తైవాన్ మంత్రి విపరీతంగా కనెక్ట్ అయ్యారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆ దేశంలో ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.బాహుబ‌లి చిత్రం గురించి తైవాన్ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జోసెఫ్ వూ మాట్లాడుతూ బాహుబ‌లి త‌న ఫేవ‌రేట్ చిత్రమ‌ని చెప్పారు.

ప్ర‌తీసారి నేను టీవీలో బాహుబ‌లి సినిమా చూస్తుంటాను.సినిమా చూసేట‌పుడు ఛాన‌ల్ మార్చ‌వ‌ద్ద‌ని నా భార్య కి చెప్తా.

ఎందుకంటే నాకు బాహుబ‌లి సినిమా మ‌ళ్లీమ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది.నేను ఎన్నిసార్లు బాహుబ‌లి చిత్రాన్ని చూశానో నాకు తెలియ‌దు.

ఇండియ‌న్ సినిమా చూడ‌టం చాలా స‌ర‌దాగా ఉంటుంద‌ని జోసెఫ్ వూ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube