KCR Facing Issues With His Own People  

Kcr Facing Issues With His Own People-

మన రాష్ట్రంలో అయినా పరాయి రాష్ట్రంలో అయినా అధికార పక్షం పై ప్రతిపక్షాలు విమర్శలు షరా మామూలే.అయితే అధికార పక్ష నేతలే తమ ప్రభుత్వం పై నిందలు వేయడం చాలా అరుదుగా చూస్తాం.

అయితే నిన్న గాక మొన్న చంద్రబాబు తీరుపై ఒకింత దురుసుగా మాట్లాడారు ఆయన క్యాబినెట్ మంత్రులు.అక్కడ మనం గమనించాల్సింది వారు తమ అధినేత గురించి మాట్లాడారు తప్పా పాలన గురించి కాదు.

-

ఇక మరోపక్క తెలంగాణా విషయానికి వస్తే తెలంగాణా మంత్రులు కొందరు వింతగా.అవసరం లేకపోయినా తమ ప్రభుత్వాన్ని తామే ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉండడం గమనార్హం.

తాజాగా అలాంటి చిత్రమైన వ్యాఖ్యనే మంత్రి పోచారం మరోసారి చేశారని చెప్పాలి.ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఆర్నెల్లలో అద్భుతాలు చేయలేమని వ్యాఖ్యానించటం కాస్త చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆర్నెల్లలో అద్భుతాలు చేయలేరన్న విషయాన్ని పోచారం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.ఆ విషయం అందరికి తెలుసని.ప్రజలేమీ అద్భుతాలు ఆశించరన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఇక కేసీఆర్ లాంటి అపర చాణఖ్యుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజలు పెద్దగా ఆశించేది ఏమీ ఉండదు అని కాకపోతే ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు చెలరేగిపోవడానికి ఆసరాగా ఉంటాయని రాజకీయ విశ్లేషకుల వాదన.

ఇప్పుడు ఆర్నెల్లలో కాదన్న వారు రేపొద్దున ఐదేళ్లలో అద్భుతాలు చేయలేమని ప్రభుత్వం పై ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తే ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వ వర్గాలు ఫీల్ అవుతున్నాయి.ఏది ఏమైనా ఆలోచించి మాట్లాడటం ఎంతో మంచిది అని తెరాస లో కొందరి వాదన.

Latest News..

Kcr Facing Issues With His Own People- Related....