త‌డ‌బ‌డ్డ ఈట‌ల‌.. ఆడేసుకుంటున్న గులాబీ కార్య‌క‌ర్త‌లు!

తెలంగాణ ఉద్య‌మంలో కీలకంగా ఉన్న నేత ఈట‌ల రాజేంద‌ర్‌.కేసీఆర్ త‌ర్వాత అంత‌టి మాట‌కారిగా ఆయ‌న‌కు పేరుంది.

 Tadabedda Eeta Ordering Pink Activists-TeluguStop.com

ఎన్నో పెద్ద పెద్ద ఉద్య‌మాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నేత‌గా ఆయ‌న‌కు పేరుంది.ఎంతోమంది పెద్ద లీడ‌ర్ల‌కు ఆయ‌న మాట‌ల‌తో చెక్ పెట్టిన మాట‌కారిగా కూడా గుర్తింపు ఉంది.

అలాంటి నిఖార్సైన ఉద్య‌మ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ తొలిసారి త‌డ‌బ‌డ్డాడు.అదికూడా కీల‌క‌మైన పార్టీ గుర్తు, జెండా విష‌యంలో త‌ప్పు చెప్పాడు.

 Tadabedda Eeta Ordering Pink Activists-త‌డ‌బ‌డ్డ ఈట‌ల‌.. ఆడేసుకుంటున్న గులాబీ కార్య‌క‌ర్త‌లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో నిన్న బీజేపీ పార్టీ ప‌దాధికారుల స‌మావేశం నిర్వ‌హించారు.కాగా ఈ స‌మావేశానికి పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, ఇత‌ర ముఖ్య నేత‌లు వ‌చ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో బండి సంజ‌య్ మాట్లాడిన అనంత‌రం ఉద్య‌మ నేత ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతూ హుజూరాబాద్ లో ఎగిరేది గులాబీ జెండా అంటూ నోరు జారారు.అంతే ప‌క్క‌నున్న బండి సంజ‌య్ వెంట‌నే అల‌ర్ట్ అయ్యి ఈట‌ల‌కు సైగ చేయ‌డంతో నోరు క‌రుచుకున్నారు.

Telugu @ktrtrs, Eetala Rajendar-Telugu Political News

వెంట‌నే స‌రిచేసుకుని కాషాయ జెండా అంటూ వ‌క‌ర్ చేసుకున్నారు.అయితే రాజందేర్ త‌డ‌బ‌డ్డ వీడియోను టీఆర్ ఎస్ నేత‌లు సోస‌ల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచేది గెలాబీ జెండా అని రాజేంద‌రే స్వయంగా ఒప్పుకున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.అలాగే హుజూరాబాద్‌లో బీజేపీ గెల‌వ‌ద‌ని ఇన్‌డైరెక్టుగా అభ్య‌ర్థి ఒప్పుకున్నాడ‌ని ట్రోల్ చేస్తున్నారు.

ఈట‌ల‌పై ఓ రేంజ్‌లో కార్క‌ర్త‌లు మాట‌ల తూటాలే పేల్చుతున్నారంటే న‌మ్మండి.ఇంకొంద‌రు నెటిజ‌న్లు ఈట‌ల రాజేంద‌ర్ ఇంకా క‌మ‌లం గూటిలో ఇముడ‌లేదంటూ కామెడీ చేస్తున్నారు.

ఇలా మొత్తానికి ఈట‌ల తొలి సారి నోరు జార‌డంతో అబాసు పాల‌వుతున్నాడు.ఇప్ప‌టికైనా ఆయ‌న బీజేపీ పార్టీని పూర్తిగా ఆవాహ‌న చేసుకోలంటూ చాలామంది సూచిస్తున్నారు.

ఎంతైనా గులాబీ పార్టీలో సుదీర్ఘ‌కాలం పాటు చేయ‌డంతో ఇంకా ఆ అలావాటు పోవ‌ట్లేదు.

#@KTRTRS #Eetala Rajendar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు