రీఎంట్రీలోనూ రాములమ్మకు పోటీ.. రెమ్యునరేషన్‌తో అవాక్కు చేసింది!  

Tabu Shocking Remuneration For Ala Vaikuntapuramulo-remuneration,sarileru Neekevvaru,tabu,vijayashanti

సంక్రాంతి కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే.మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లుఅర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు సంక్రాంతి పండగకు ఒక్కరోజు తేడాతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.

Tabu Shocking Remuneration For Ala Vaikuntapuramulo-Remuneration Sarileru Neekevvaru Tabu Vijayashanti

ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు కావడంతో పండగపూట సినిమాలను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.

ఇక ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్ ఏమిటి అంటే ఇద్దరు సీనియర్ హీరోయిన్లు రీఎంట్రీ ఇచ్చారు.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వగా, అల వైకుంఠపురములో చిత్రంతో టబు రీఎంట్రీ ఇచ్చింది.ఈ ఇద్దరు కూడా తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేసినవారు.

అయితే విజయశాంతి తెలుగులో టబు కంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

వీరిద్దరు కూడా ఒకే విధమైన రెమ్యునరేషన్‌ను తమ సినిమాల కోసం తీసుకున్నారు.సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించినందుకు విజయశాంతి రూ.3 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.అటు టబు కూడా అల వైకుంఠపురములో సినిమాకు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది.అయితే విజయశాంతి క్రేజ్‌కు ఆమె రూ.3 కోట్లు తీసుకోవడం ఓకే కానీ, టబుకు తెలుగునాట క్రేజ్ పోయిందని, ఆమె కూడా ఇంతమొత్తం రెమ్యునరేష్ తీసుకోవడం ఏంటని ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.

.

తాజా వార్తలు

Tabu Shocking Remuneration For Ala Vaikuntapuramulo-remuneration,sarileru Neekevvaru,tabu,vijayashanti Related....