పాండురంగడును ఆమె ఇంకా మర్చిపోలేదా.. బాలయ్యకు నో చెప్పిందట

నందమూరి బాలకృష్ణ ప్రతి సినిమా షూటింగ్ ఆరంభంకు ముందు హీరోయిన్స్ సమస్య ఎదురవుతోంది.ఆయన ప్రస్తుతం నటిస్తున్న అఖండ సినిమా కోసం ఎంతో మంది హీరోయిన్స్ తో సంప్రదింపులు జరిపి చివరకు పెద్దగా క్రేజ్‌ లేని ప్రగ్యా జైస్వాల్‌ ను ఎంపిక చేయడం జరిగింది.

 Tabu Dont Want To Act In Balakrishan And Gopi Chand Movie-TeluguStop.com

బాలకృష్ణ మరియు ప్రగ్యాజైస్వాల్‌ ల జోడీ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది.పెద్ద ఎత్తున అంచనాలు ఉన్న అఖండ సినిమా లో హీరోయిన్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ సమయంలోనే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.హీరోయిన్ గా ఇప్పటికే పలువురిని సంప్రదించారట.

 Tabu Dont Want To Act In Balakrishan And Gopi Chand Movie-పాండురంగడును ఆమె ఇంకా మర్చిపోలేదా.. బాలయ్యకు నో చెప్పిందట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని ఏ ఒక్కరు కూడా సెట్‌ అవ్వలేదని అంటున్నారు.రెండు పాత్రల్లో ఈ సినిమా లో బాలయ్య కనిపిస్తాడు.

కనుక ఇద్దరు హీరోయిన్స్‌ కావాల్సి ఉంటుందట.

ఒక హీరోయిన్‌ గా సీనియర్‌ హీరోయిన్ కావాల్సి ఉండగా రెండవ హీరోయిన్ గా యంగ్‌ హీరోయిన్ అవసరం ఉంది.

సీనియర్‌ హీరోయిన్ పాత్రకు గాను టబు ను సంప్రదించారట.కాని ఆమె బాలయ్య సినిమా అంటే బాబోయ్‌ నేను చేయను అనేసిందట.గతంలో వీరు చెన్నకేశవ రెడ్డి సినిమా లో నటించారు.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Telugu Balakrishna, Film News, Movie News, Pandurangadu, Tabu-Movie

కాని పాండురంగడు సినిమా లో నటించిన వీరిద్దరు బొమ్మ దద్దరిల్లి పోలేదు కదా కనీసం ఆకట్టుకోలేక పోయింది.ఇక ఇద్దరి కాంబో సన్నివేశాల పై విమర్శలు వచ్చాయి.అందుకే ఈ సినిమా లో ఆమె బాలయ్య తో నటించేందుకు భయపడుతోంది.దర్శకుడు ఆమెను ఎంతగా ఒప్పించేందుకు ప్రయత్నించినా కూడా ఒప్పుకోవడం లేదట. ఈ సినిమా లో వరలక్ష్మి కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

#Balakrishna #Pandurangadu #Tabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు