రానా చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో నటించనున్న టబు

ఒకప్పుడు వెండి తెర పై కథానాయకులు గా అలరించిన హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కోవకే చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు.

 Tabu Doing A Different Role In Rana Movie-TeluguStop.com

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అలరించిన టబు ఇప్పుడు లేడీ డాన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే యంగ్ హీరో దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విరాటపర్వం 1992’.

ఈ చిత్రంలో సాయి పల్లవి కధానాయికగా నటిస్తుంది.వేణు ఉడుగుల దర్శకత్వంలో రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నటి టబు లేడీ డాన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ చిత్రంలో ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్ కూడినది అని వైవిధ్యభరితంగా ఈ చిత్రంలో టబు పాత్ర ఉండబోతున్నట్లు సమాచారం.

అయితే ఇంతవరకూ టబు ఈ తరహా పాత్ర ను పోషించకపోవడం తో వెంటనే ఈ చిత్రానికి ఒకే చెప్పేసిందట.

ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులలో ఉన్నట్లు తెలుస్తుంది.మొత్తానికి ఈ చిత్రం జులై నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

అయితే ఇదే చిత్రంలో సాయి పల్లవి పాత్ర కూడా భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తుంది.ఈ చిత్రంలో ఆమె ఒక నక్సలైట్ గా డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

అయినా ఎలాంటి పాత్రలో అయినా జీవించేసే సాయి పల్లవి డీ గ్లామరైజ్డ్ పాత్రలో అయినా అభిమానులను మెప్పిస్తుంది అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube