నితిన్ కోసం కోటి డిమాండ్ చేస్తున్న అల్లు అర్జున్ తల్లి...  

Tabu Demand 1 Crore For The Nitin New Movie - Telugu Andhadun Movie Remake News, Tabu, Tabu Latest News, Tabu Moovie News, Tabu Movie News, Tabu Remuneration News, Tollywood News

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ బాలీవుడ్లో ఘన విజయం సాధించినటువంటి “అంధాదున్” అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.

Tabu Demand 1 Crore For The Nitin New Movie

అయితే ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి ఎన్.సుధాకర్ రెడ్డి తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో విలన్ పాత్రలో టబు నటిస్తున్నట్లు సమాచారం.అయితే ఇందుకుగాను టబు దాదాపుగా కోటి రూపాయలు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే బాలీవుడ్ అంధాదున్ చిత్రంలో కూడా మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించింది.అందువల్లనే టబు ఇంత పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీనికితోడు ఇటీవల కాలంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అల వైకుంఠ పురములో అనే చిత్రంలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో ప్రేక్షకులను బాగానే అలరించింది.ఈ విషయం కూడా తెలుగులో టబు తన పారితోషికాన్ని పెంచడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.

అయితే టబుకి  ఉన్నటువంటి క్రేజ్ కి కోటి రూపాయలు ఇవ్వడం పెద్ద మ్యాటర్ ఏమి కాదు కానీ బడ్జెట్ విషయంలో నిర్మాత సుధాకర్ రెడ్డి  ఆలోచిస్తున్నట్లు సమాచారం.మరోవైపు ఇదే పాత్రకి టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ పేరు కూడా వినిపిస్తోంది.

ఒకవేళ టబు పాత్రలో అనసూయని తీసుకుంటే బడ్జెట్ కూడా కొంత మేర కలిసి వస్తుండడంతో యాంకర్ అనసూయకే నిర్మాత ఓటు వేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయాల గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

 కానీ పలువురు పెద్దల సమక్షంలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ కార్యక్రమాన్ని నిన్నటి రోజున మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.అంతేగాక జూన్ నెల నుంచి ఈ చిత్రం వరుస షూటింగ్ షెడ్యూల్ తో చిత్రీకరణ జరుపుతున్నట్లు దర్శకుడు మేర్లపాక గాంధీ తెలిపారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం టబు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.అంతేకాక తాజాగా ప్రముఖ ఫోటోషూట్ సంస్థ అయినటువంటి రత్నాన్ని క్యాలెండర్ కోసం తన హాట్ హాట్ అందాలతో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.అంతేకాక ప్రస్తుతం  టబు “జవానీ జానేమన్” అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం జూన్ నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు నితిన్ కక్కర్ సన్నాహాలు చేస్తున్నాడు.

తాజా వార్తలు

Tabu Demand 1 Crore For The Nitin New Movie-tabu,tabu Latest News,tabu Moovie News,tabu Movie News,tabu Remuneration News,tollywood News Related....