బయో బబుల్ నుంచి బయటకు రానంటున్న మన్మధుడు భామ..?

తెలుగు సినీ నటి టబు గురించి అందరికీ తెలిసిందే.తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన టబు తమిళం, మలయాళం, హిందీ, ఆంగ్ల , ఉర్దూ, మరాఠీ సినిమాలలో కూడా నటించింది.

 Tabu Back Sets Bhool Bhulaiyaa 2, Tabu, Bollywood, Bhool Bhulaiyaa, Bio Babul-TeluguStop.com

తొలిసారిగా బాలీవుడ్ సినిమా లో బాలనటిగా వెండితెరకు పరిచయమైన టబు ఆ తర్వాత కూలి నెం1 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్న టబు.

తను షూటింగ్ సమయంలో దిగిన ఫోటో షేర్ చేయగా అందులో టబు బయో బబుల్ లో నిల్చొని ఉంది.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ కాగా.

ఆమె కోవిడ్ రూల్స్ ను పాటిస్తున్నట్లు అర్థమయింది.

ప్రస్తుతం టబు అనీస్ బజ్మీ దర్శకత్వం లో తెరకెక్కనున్న సినిమా ‘భూల్ భులైయా‌ 2’ సినిమాల్లో నటిస్తుంది.

ఇందులో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ కూడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఇక ప్రస్తుతం టబు, కార్తీక్, కియారా లపై కొన్ని సన్నివేశాలు చేస్తున్నారు.ఇక షూటింగ్ సమయంలో టబు కోవిడ్ రూల్స్ ను పాటిస్తూ బయో బబుల్ నుంచి బయటకు రావడం లేదు.కేవలం సన్నివేశాల సమయంలో తప్ప మిగతా సమయంలో అందులోనే ఉంటుంది టబు.ఇక ఈ విషయం గురించి కార్తీక్ మాట్లాడుతూ.టబు గారు తిరిగి సెట్ లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందంటూ.

ఆమె తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్నాని తెలిపాడు.కానీ ఆమె బయో బబుల్ నుంచి బయటకు రావడం లేదు అంటూ.

ఆమె తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.ఇక ఈ సినిమా 2007లో వచ్చిన ‘భూల్ భులయ్యా’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనుండగా నవంబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube