మసీదు లో 14 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులు,పోలీసులకు పట్టించిన సైనికులు  

Tablighi Patients Masjid Lucknow - Telugu Covid-19, Lucknow, Mosque, Nizamuddin Markaz, Tablighi Patients

దేశంలో కరోనా ను చాలా తేలికగా మట్టుపెట్టొచ్చు అని భావించిన కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సమావేశాల రూపంలో గట్టి దెబ్బ పడింది.ఈ సమావేశాల్లో పాల్గొన్న వారి వల్ల వేలమంది కరోనా బారిన పడడం తో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రప్రభుత్వం కూడా తలలు పట్టుకుంది.

 Tablighi Patients Masjid Lucknow

ఈ ఒక్క కారణం తో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.ఈ నేపథ్యంలో వారందరిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలి అని అధికారులు ప్రయత్నిస్తుండగా వారంతా తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో ఆర్మీ కంటోన్మెంట్ లోని సదర్ బజార్ అలీజాన్ మసీదు లో 14 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులు కరోనా వైరస్ లక్షణాలతో ఉన్నారని,వారంతా మసీదు లోనే కానున్నట్లు మిలటరీ ఇంటెలిజెన్స్ కు సమాచారం లభించింది.దీనితో మిలటరీ అధికారులు వెంటనే లక్నో పోలీస్ కమీషనర్ కు సమాచారం అందించడం తో వారితో కలిసి మసీదు పై దాడి చేయగా, లోపల వారందరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

మసీదులో దాక్కున్న వారంతా కూడా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సమావేశంలో పాల్గొన్న తరువాత వారికి కరోనా లక్షణాలు వచ్చినట్లు అధికారుల దర్యాప్తు లో తేలింది.

మసీదు లో 14 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులు,పోలీసులకు పట్టించిన సైనికులు-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో వారి నమూనాలను సేకరించి పరీక్షకు పంపించి వారందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు తెలుస్తుంది.వారందరి పై ఐపీసీ సెక్షన్ 188, 269, 270,271 ల కింద కేసు నమోదు చేశారు.మసీదు పక్కనే ఉన్న జారా క్లినిక్ డాక్టర్ ఆసిఫ్ ఖాన్ తబ్లిగ్ జమాత్ సభ్యులకు చికిత్స అందించారని తేలడంతో డాక్టరును కూడా పట్టుకున్న, అనంతరం మసీదును శానిటైజ్ చేయించినట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tablighi Patients Masjid Lucknow Related Telugu News,Photos/Pics,Images..