ఏడాదికి ఒకటి పక్కా అంటోన్న బ్యూటీ

Taapsee To Do Atleast One South Movie In A Year, Taapsee, Pink, Telugu Movies, Tollywood News

టాలీవుడ్‌లో ‘ఝుమ్మంది నాదం’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తాప్సీ పన్నూ, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.వచ్చిన ప్రతి ఆఫర్‌ను వినియోగించుకుని నెమ్మదిగా బాలీవుడ్ వైపు తన అడుగులు వేసింది ఈ సొట్టబుగ్గల చిన్నది.

 Taapsee To Do Atleast One South Movie In A Year, Taapsee, Pink, Telugu Movies, T-TeluguStop.com

ఇక బాలీవుడ్‌లో అమ్మడికి మంచి సక్సెస్ రావడంతో అక్కడే సెటిల్ అయ్యింది ఈ బ్యూటీ.కాగా ప్రస్తుతం బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా తాప్సీ మారిందంటే ఆమెకు అక్కడ ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

తాప్సీ లీడ్ రోల్స్ చేస్తున్న చిత్రాలు ఆమెకు మంచి పేరును తీసుకురావడమే కాకుండా అదిరిపోయే సక్సెస్‌ను కూడా అందుకుంటుండటం విశేషం.

ఇక తనకు హీరోయిన్‌గా గుర్తింపు తీసుకొచ్చిన తెలుగు, తమిళ చిత్రాలను బాగా తగ్గించేసిన తాప్సీ, ఇప్పుడు మళ్లీ సౌత్ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపుతోంది.

అయితే సౌత్ జనాలను తనను ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారని, అందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తాప్సీ అంటోంది.ఈ క్రమంలో ఏడాదికి ఒక తెలుగు లేదా తమిళ చిత్రం ఖచ్చితంగా చేస్తానని తాప్సీ క్లారిటీ ఇచ్చింది.

దీంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మారినా, తనకు సౌత్ పట్ల ఉన్న గౌరవాన్ని ఏమాత్రం మరిచిపోలేదని వారు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా ప్రస్తుతం బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తున్న తాప్సీ, తమిళంలో ఓ సినిమాను చేస్తోంది.తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న సినిమాలో తాప్సీ నటిస్తోంది.

గతంలో పలు హిట్ తెలుగు చిత్రాల్లో నటించిన తాప్సీ, మళ్లీ తెలుగులో ఎప్పుడు కనిపిస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఏదేమైనా తాప్సీ సౌత్‌లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube