బాలీవుడ్ లో దుమ్ము లేపుతున్న తాప్సి! ఇప్పుడు మిథాలీ బయోపిక్ వంతు  

Taapsee Pannu To Play Mithali Raj In Her Biopic -

తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సికి ఇక్కడ అనుకున్న స్థాయిలో తన టాలెంట్ ని నిరూపించుకునే అవకాశం రాలేదు.స్టార్ హీరోలతో జోడీ కట్టే అవకాశం వచ్చిన అవన్నీ చాలా వరకు గ్లామర్ పాత్రలే అని చెప్పాలి.

Taapsee Pannu To Play Mithali Raj In Her Biopic

ఏదో ఒకటి అర సినిమాలు మాత్రమే తాప్సిలో నటిని పరిచయం చేసాయి.అయితే ఆ సినిమాలు ప్రేక్షకులకి చేరువ కాకపోవడంతో ఈ ఉత్తరాది భామని తెలుగు ఆడియన్స్ కూడా గ్లామర్ క్వీన్ గానే చూస్తూ వచ్చారు.

ఇక దర్శకులు కూడా ఈ భామకి గ్లామర్ పాత్రలే ఆఫర్ చేసారు.అయితే టాలీవుడ్ లో తనని ప్రూవ్ చేసుకునే అవకాశం రాకపోవడంతో తాప్సి బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే తన టాలెంట్ చూపించింది.

బాలీవుడ్ లో దుమ్ము లేపుతున్న తాప్సి ఇప్పుడు మిథాలీ బయోపిక్ వంతు-Movie-Telugu Tollywood Photo Image

పూంక్ సినిమాలో కీలక పాత్ర చేసిన తాప్సి అందులో తాను ఎంత మంచి నటినో అనే విషయం అందరికి పరిచయం చేసుకుంది.దీంతో బాలీవుడ్ లో కాన్సెప్ట్ మూవీస్ అంటే దర్శకులు ఫస్ట్ ఛాయస్ తాప్సికి ఇవ్వడం మొదలెట్టారు.

అలా ఈ భామ బాలీవుడ్ లో మంచి కథా బలం ఉన్న సినిమాలు చేస్తూ నటిగా వరుస హిట్ లతో దూసుకుపోతుంది.తాజాగా గేమ్ ఓవర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన తాప్సి పూర్తిగా చక్రాల కుర్చీలోనే కూర్చొని సినిమాని నడిపించింది.

మరో వైపు బద్లా అనే ఓ హాకీ బ్యాగ్రౌండ్ సినిమాలో నటించి మెప్పించింది.ఈ నేపధ్యంలో ఈ భామకి మరో అద్బుత అవకాశం వచ్చింది.ఇండియన్ విమెన్ క్రికెటర్, హైదరాబాదీ గర్ల్ మిథాలీ రాజ్ జీవిత కథతో తెరకెక్కే సినిమాలో తాప్సిని మెయిన్ లీడ్ గా ఫైనల్ చేసారని సమాచారం.

తాజా వార్తలు

Taapsee Pannu To Play Mithali Raj In Her Biopic- Related....