సందీప్ రెడ్డికి వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చిన తాప్సి  

Taapsee Pannu Takes Cryptic Dig At Kabir Singh Director -

టాలీవుడ్ లో తాప్సి అంటే గ్లామర్ హీరోయిన్.కాని బాలీవుడ్ లో తాప్సి అంటే బోల్డ్ పెర్ఫర్మార్.

Taapsee Pannu Takes Cryptic Dig At Kabir Singh Director

వరుసగా డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో బాలీవుడ్ లో హిట్ మీద హిట్ కొడుతున్న తాప్సి సౌత్ సినిమాలు అంటే కేవలం హీరోయిన్ గ్లామర్ కే తొప్ప నటనకి ప్రాధాన్యత ఇవ్వరు అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది.అప్పట్లో రాఘవేంద్రరావు తన బొడ్డు అందాలు చూపించడం మీద కూడా బోల్డ్ కామెంట్స్ చేసింది.

ఓ వైపు మంచి సినిమాలు చేస్తూ మరో వైపు తన మాటలతో మరో కంగనా రనౌట్ తరహాలో ఎలాంటి దాపరికం లేకుండా ఓపెన్ గా మాట్లాడుతూ బాలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షించింది.

ఇదిలా ఉంటే ఈ మంధ్య సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగ అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టుకుంటారు, ఒకరిని ఒకరు కొట్టుకుంటారు అని చేసిన కామెంట్స్ పై సెలబ్రిటీ హీరోయిన్స్ అందరూ రియాక్ట్ అయ్యి విమర్శలు చేసారు.

సినీ మహిళాలోకం పెద్ద ఎత్తున లేచి సందీప్ ని టార్గెట్ చేసారు.ప్రేమ ఉంటే మహిళలని కొడతారా అంటూ విమర్శించారు.ఇదిలా ఉంటే తాజాగా తాప్సి సందీప్ కి తనదైన శైలికి కాస్తాగా వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చింది.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిపై అనుమానంతో ఆమె తల పగలగొట్టి దారుణంగా చంపేసాడు.

ఈ వార్త‌ను తాప్సి ట్యాగ్ చేస్తూ అనుమానంతో తల పగలగొట్టాడా? వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉండుంటారు.తన నిజమైన ప్రేమను నిరూపించుకోవడానికే అత‌ను ఆమెను చంపేశాడేమో` అంటూ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ తో సందీప్ కి ఆమె విభిన్నంగ కౌంటర్ ఇచ్చినట్లు అయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Taapsee Pannu Takes Cryptic Dig At Kabir Singh Director- Related....