ఒక్క హిట్ తో అటు హీరోలపై.. ఇటు స్టార్ వారసులపై తాప్సి విసుర్లు

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ అందుకొని బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ లేడీ ఒరియాంటెడ్ కథలతో వరుస హిట్స్ అందుకొని దూసుకుపోతున్న పంజాబీ ముద్దుగుమ్మ తాప్సి.తెలుగులో ఉన్నప్పుడు కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని ప్రయత్నాలు చేసి వచ్చిన ప్రతి సినిమా చేసి నాలుగు డబ్బులు సంపాదించుకొని బాలీవుడ్ చెక్కేసి తెలుగు సినిమా మీద విమర్శలు చేసిన తాప్సి ఇప్పుడు బాలీవుడ్ హీరోల మీద, స్టార్ వారసుల మీద తన కోపాన్ని చూపిస్తుంది.

 Taapsee Pannu Opens Up About Nepotism In The Industry-TeluguStop.com

ఇప్పటి వరకు స్టార్ వారసుల మీద బాలీవుడ్ లో ఎక్కువగా ద్వేషం చూపించే హీరోయిన్ అంటే అందరూ కంగనా రనౌత్ పేరు చెబుతారు.ఇప్పుడు తాప్సి కూడా ఆమెనే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది.

తాజాగా తప్పడ్ సినిమాతో బాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టిన ఈ భామ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.బాలీవుడ్ లో స్టార్ వారసులు అనే ఒకే ఒక్క ట్యాగ్ తో చాలా మంది అవకాశాలు సొంతం చేసుకుంటున్నారని తాప్సి కీలక వ్యాఖ్యలు చేసింది.

నా చేతిలోకి వచ్చిన సినిమాలు కూడా స్టార్ వారసులు తన్నుకుపోయారని విమర్శించింది.ఇండస్ట్రీలో ఎలాంటి వారి కారణంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని తమ అవకాశాలు దూరం అవుతున్నాయని వాపోయింది.

అదే సమయంలో హీరోలు ఎవరు కూడా తనతో సినిమా చేయడానికి ఇష్టపడటం లేదని, తనతో సినిమా చేస్తే యాక్టింగ్ లో వారిని డామినేట్ చేసేస్తున్నా అనే ఉద్దేశ్యంతో వారు నన్ను పక్కన పెడుతున్నారు అంటూ కామెంట్స్ చేసింది.మరి తాప్సి చేసిన ఈ వివాదాస్పద కామెంట్స్ ఆమె కెరియర్ కి ఉపయోగపడతాయా లేక విమర్శలు ఎదురవుతాయా అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube