స్టార్ కిడ్స్ మన సక్సెస్ ని ఎప్పటికి ఆపలేరు అంటున్న తాప్సి  

Taapsee Pannu Once Again Comments on Nepotism, Bollywood, Celebrity Families, Kangana Ranaut, Tapseen Pannu, Nepotism - Telugu Bollywood, Celebrity Families, Kangana Ranaut, Nepotism, Taapsee Pannu Once Again Comments On Nepotism, Tapseen Pannu

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత కంగనా రనౌత్ నెపోటిజం ఇష్యూని తెరపైకి తీసుకొచ్చింది.అప్పటికే చాలా సందర్భాలలో నెపోటిజం గురించి కాంగానా కామెంట్స్ చేసిన సుశాంత్ మరణానికి నెపోటిజం కారణం అని కంగనా గట్టిగా చెప్పడంతో బాలీవుడ్ లో బంధుప్రీతి, వారసత్వ ఆధిపత్యం గురించి ప్రజలలోకి బాగా నెగిటివ్ ఒపీనియన్ వెళ్ళింది.

TeluguStop.com - Taapsee Pannu Once Again Comments On Nepotism

ఇదే సందర్భంగా చాలా మంది నటులు ఈ నెపోటిజం బారిన పడి అవకాశాలు కోల్పోయామని, తమకి రావాల్సిన అవకాశాలు ఎవరో తన్నుకుపోయారని విమర్శలు గుప్పించారు.దీంతో సౌత్ లో కేవలం హీరోల విషయంలో మాత్రమే నెపోటిజం ఉంటే బాలీవుడ్ లో హీరోలతో పాటు హీరోయిన్స్ విషయంలో కూడా ఈ నెపోటిజం, వారసత్వ నటుల ఆధిపత్యం ఉందని అందరికి అర్ధమైంది.

అయితే కొంత మంది భామలు మాత్రం నెపోటిజం అంటే అస్సలు ఒప్పుకోరు.ఎక్కడైనా నెపోటిజం ఉంటుందని, అదసలు తప్పే కాదని వాదిస్తారు.

TeluguStop.com - స్టార్ కిడ్స్ మన సక్సెస్ ని ఎప్పటికి ఆపలేరు అంటున్న తాప్సి-General-Telugu-Telugu Tollywood Photo Image

అలాగే టాలెంట్ ఉండి, కష్టాన్ని నమ్ముకుంటే స్టార్ హీరోయిన్స్ గా మనం ఎదగకుండా ఎవరూ ఆపలేరని అంటున్నారు.అలాంటి భామల జాబితాలో తాప్సి కూడా ఉంది.

ఈ అమ్మడు మొదటి నుంచి నెపోటిజం కాన్సెప్ట్ ని వ్యతిరేకిస్తుంది.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు బాలీవుడ్ లో డిఫరెంట్ కంటెంట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన తాప్సి బంధుప్రీతి అనే విషయంలో పూర్తిగా విభేదిస్తుంది.

ఈ నేపథ్యంలో తాప్సీ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యాయి.సినిమా ఇండస్ట్రీలో అవుట్‌ సైడర్‌, ఇన్‌ సైడర్‌ అంటూ పలు డిబేట్స్‌ జరిగాయి.

అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు కానీ ఎవరికీ పరిష్కారం తెలియదు.ఓ ఆర్టిస్ట్‌ సక్సెస్‌కి కారణం ఎలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

అంతే తప్ప స్టార్‌ కిడ్స్‌కు మంచి సినిమాలు వస్తాయని అనుకోవడం తప్పు.ఓపిగ్గా ఎదురుచూడటం, కష్టపడటంతో పాటు అదష్టం కూడా కలిసి రావాలి.

చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి.ఒక్కో సారి ఆ చిన్న అవకాశం మన జీవితాన్ని మార్చేస్తుంది అని తాప్సీ ట్వీట్‌ పెట్టారు.

తాప్సి చేసిన పోస్ట్ చూసిన చాలా మంది ఆమె వాఖ్యలకి మద్దతు ఇస్తున్నారు.ఈ రోజు చిన్న చిన్న అవకాశాలే రేపటి రోజున గొప్ప అవకాశాలు తీసుకురావడానికి కారణం అవుతాయని అంటున్నారు.

#Nepotism #Kangana Ranaut #Tapseen Pannu #TaapseePannu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Taapsee Pannu Once Again Comments On Nepotism Related Telugu News,Photos/Pics,Images..