నా స్థాయి తెలుసు.. అందుకే డిమాండ్‌ చేయను

ఏ రంగంలో అయినా కూడా మగవారి కంటే ఆడవారికి పారితోషికాలు కాస్త తక్కువ అని చెప్పాలి.సినీ పరిశ్రమలో ఆ తేడా చాలా ఉంటుందని సౌత్‌ సినిమా హీరోయిన్స్‌ పారితోషికం చూస్తే తెలుస్తోంది.

 Taapsee Pannu About Her Remuneration-TeluguStop.com

ఒక స్టార్‌ హీరో ఒక సినిమాకు 15 కోట్లు తీసుకుంటే అదే సినిమాలో నటించిన హీరోయిన్‌ కేవలం కోటికి అటు ఇటుగా మాత్రమే పారితోషికం అందుకుంటున్నారు.అయితే బాలీవుడ్‌ లో మాత్రం హీరోయిన్స్‌ పారితోషికం కాస్త ఎక్కువగానే ఉంటాయి.

అక్కడ స్టార్‌ హీరోయిన్స్‌ 10 నుండి 20 కోట్ల వరకు కూడా తీసుకుంటున్నారు.

సౌత్‌ హీరోయిన్స్‌ పారితోషికం కూడా పెంచాలనే డిమాండ్‌ చాలా కాలంగా వస్తుంది.అయితే సినిమాలో నటించే స్టార్స్‌ అందరికి ఒకే స్థాయి పారితోషికం అంటే అది సాధ్యం అయ్యే విషయం కాదు.ఎందుకంటే ఒక్కో స్టార్‌కు ఒక్కో రకమైన క్రేజ్‌ దక్కుతుంది.

అలాంటప్పుడు అందరికి ఒకే తరహా పారితోషికం ఎలా ఇస్తారని కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ ప్రశ్నిస్తున్నారు.తాజాగా అదే విషయమై తాప్సి కూడా మాట్లాడటం జరిగింది.

తాను పారితోషికం విషయంలో పట్టు విడుపుగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.పారితోషికం డిమాండ్‌ చేసే విషయంలో ఎప్పుడు నేను నిర్మాతను ఇబ్బంది పెట్టను అంది.

నేను బాలీవుడ్‌ లో అమితాబచ్చన్‌, వరుణ్‌ ధావన్‌ వంటి స్టార్స్‌తో నటించాను.వారికి సమానంగా నాకు పారితోషికం కావాలి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది.వారు థియేటర్లకు ప్రేక్షకులకు రప్పించగల స్థాయి స్టార్స్‌.వారి స్థాయికి నేను ఎలా సమాన పారితోషికం డిమాండ్‌ చేయగలను అంటూ చెప్పుకొచ్చింది.నా స్థాయి నాకు తెలుసు, ఎప్పుడు కూడా నా స్థాయిలో పారితోషికంను డిమాండ్‌ చేస్తాను.సినిమా భారీగా ఉన్నంత మాత్రాన నేను ఎక్కువ పారితోషికంను డిమాండ్‌ చేయను అంటూ తాప్సి పేర్కొంది.

తాప్సి తరహాలోనే అంతా ఆలోచించి, ఆమెలాగే పారితోషికం విషయంలో స్థాయిని తెలుసుకుని డిమాండ్‌ చేస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube