భయపడుతూ కూర్చోవడం తన వల్ల కాదంటున్న తాప్సి  

Taapsee Continuous Plan to Shoot Four Movies, Bollywood, Kollywood, Rashmi Rocket, Annabelle, Female Centric Movies - Telugu Bollywood, Kollywood, Taapsee

సౌత్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత తాప్సి కెరియర్ మొత్తం మారిపోయింది.రెగ్యులర్ కమర్షియల్ దూరంగా ఫిమేల్ సెంట్రిక్ కథలతో దూసుకుపోతుంది.

TeluguStop.com - Taapsee Continuous Plan To Shoot Four Movies

హిట్ మీద హిట్ కొడుతూ నటిగా తన ప్రయాణాన్ని సక్సెస్ ఫుల్ గా సాగిస్తుంది.లేడీ ఒరియాంటెడ్ కథలు చేయాలని అనుకునే దర్శకులకి కేరాఫ్ అడ్రెస్ గా తాప్సి మారిపోయింది.

సౌత్ లో ఉన్నప్పుడు హిట్ మొహం చూడటానికి ఎదురుచూడాల్సి వచ్చిన తాప్సికి ఇప్పుడు హిట్స్ తప్ప ఫెయిల్యూర్ రావడం లేదు.చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక ఎలిమెంట్ తో ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది.

TeluguStop.com - భయపడుతూ కూర్చోవడం తన వల్ల కాదంటున్న తాప్సి-Bollywood News-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఈ భామ తమిళంలో అన్నాబెల్లె అన్నే హర్రర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ముగిసింది.

లాక్ డౌన్ తర్వాత కరోనా పరిస్థితులు దారుణమైన స్టేజ్ లోనే ఉన్న తాప్సి షూటింగ్ కి రెడీ అయిపోయి చెన్నైలో వాలిపోయింది.తాజాగా షూటింగ్ ముగించుకొని ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
భయపడుతూ కూర్చుంటే ఏమీ చేయలేము.అందుకే జాగ్రత్తలన్నీ తీసుకుని అన్నాబెల్లె షూటింగు పూర్తిచేశాము.ఇక హసీనా దిల్ రుబా షూటింగ్ చేయాలి.ఆ తర్వాత రష్మీ రాకెట్, లూప్ లపేటా సినిమాల షూటింగులలో పాల్గొంటా అంటూ చెప్పుకొచ్చింది.

మొత్తానికి ఈ అమ్మడు కరోనా కాలంలో కూడా ఎలాంటి భయాలు పెట్టుకోకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఇప్పుడు ఆమె చేతిలో మొత్తం నాలుగు సినిమాలు ఉన్నాయి.

అలాగే ఒక సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.ఏది ఏమైనా సౌత్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత భాగా సక్సెస్ అయిన హీరోయిన్ అంటే కచ్చితంగా తాప్సి అనే చెప్పాలి.

#Kollywood #Taapsee

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Taapsee Continuous Plan To Shoot Four Movies Related Telugu News,Photos/Pics,Images..