వాళ్లకు సంస్కారం నేర్పితే ఇలాంటివి జరగవు.. తాప్సీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన తాప్సీ తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయినా బాలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు వైవిధ్యమైన పాత్రలతో కూడిన సినిమాలను ఎంచుకుంటూ బాలీవుడ్ లో తాప్సీ సత్తా చాటుతున్నారు.

 Taapsee Annabelle Sethupathi Movie Promotions-TeluguStop.com

ప్రస్తుతం తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో తాప్సీ నటిస్తున్నారు. అనబెల్ సేతుపతి సినిమా ప్రమోషన్లలో భాగంగా తాప్సీ మీడియాతో ముచ్చటించారు.

ఒకే తరహా సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని అనబెల్ సేతుపతి హర్రర్ కామెడీ కాదని తాప్సీ అన్నారు.అనబెల్ పాత్ర తనకు బాగా నచ్చిందని రుద్ర పాత్ర కొంచెం కష్టమని తను సినిమాలో పోషించిన రెండు పాత్రల గురించి తాప్సీ చెప్పుకొచ్చారు.బ్లర్ అనే మూవీతో నిర్మాతగా కూడా కెరీర్ ను మొదలుపెడుతున్న తాప్సీ నిర్మాత అంటే అందరి కంటే సెట్ కు ముందుగా వెళ్లాలని ప్రాంజల్ కు నిర్మాణ బాధ్యతలను అప్పగించానని అన్నారు.

 Taapsee Annabelle Sethupathi Movie Promotions-వాళ్లకు సంస్కారం నేర్పితే ఇలాంటివి జరగవు.. తాప్సీ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రాంజల్ తనకు మంచి ఫ్రెండ్ అని ప్రాంజల్ సూచనల మేరకు తాను సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టానని తాప్సీ చెప్పుకొచ్చారు.మిషన్ ఇంపాజిబుల్ మూవీ మూడురోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని తాప్సీ పేర్కొన్నారు. హత్యాచార ఘటనల గురించి స్పందిస్తూ తాను తన ఫ్యామిలీకి సంబంధించిన బాధ్యతలను తీసుకోగలనని తన కుటుంబంలో అబ్బాయిలు ఉంటే అమ్మాయిలను ఏ విధంగా గౌరవించాలో తాను నేర్పగలనని తాప్సీ అన్నారు.

ప్రజలలో కూడా తాను కొంతవరకు అవగాహన కల్పించగలనని ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఫ్యామిలీలో సంస్కారం నేర్పితే హత్యాచార ఘటనలు జరగవని తాప్సీ పేర్కొన్నారు.ఓటీటీలో వచ్చేది రాంగ్ కంటెంట్ కాకూడదని ఓటీటీల విషయంలో పిల్లలను నియంత్రించాల్సి ఉంటుందని తాప్సీ అన్నారు.

రాంగ్ కంటెంట్ ఓటీటీకి మాత్రమే పరిమితమైనది కాదని తాప్సీ వెల్లడించారు.

#Taapsee #Impossible #Sexual #Horror

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు